end
=
Friday, November 1, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంSmoking:థర్డ్ హ్యాండ్ స్మోక్ ప్రమాదమే
- Advertisment -

Smoking:థర్డ్ హ్యాండ్ స్మోక్ ప్రమాదమే

- Advertisment -
- Advertisment -

  • ఉపరితలాలపై తిష్టవేసిన పొగాకు కణాలతో ముప్పు
  • స్మోక్‌ ఎక్స్‌పోజ్డ్ దుస్తులపై దీర్ఘకాలంగా అవశేషాలు
  • చెమట ద్వారా చర్మంలోకి టొబాకో పార్టికల్స్ ఎంట్రీ
  • బయోమార్కర్స్ పెంపు, రక్తంలో ప్రొటీన్ స్థాయిల మార్పు

స్మోకింగ్ (Smoking)  లేదా వేరొకరి నుంచి ‘సెకండ్-హ్యాండ్’ స్మోక్ (‘second-hand smoke)) పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలపై జనాలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. కానీ ‘థర్డ్-హ్యాండ్ స్మోక్’ (‘Third-hand smoke’)గురించే పెద్దగా తెలిసుండదు. వివరంగా చెప్పాలంటే.. ఏవైనా ఉపరితలాలపై తిష్టవేసిన పొగాకు సంబంధిత భస్మీకరించబడిన కణాలతోనూ ప్రమాదాలు విస్తరిస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ థర్డ్-హ్యాండ్ స్మోక్‌కు బహిర్గతం కావడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై పరిశోధకులు ఇటీవలే దృష్టి సారించినప్పటికీ.. పొగకు-బహిర్గతమైన దుస్తుల (Cloths)పై ఈ అవశేషాలు నెలల నుంచి సంవత్సరాల తరబడి ఉండవచ్చని అనేక అధ్యయనాలు సూచించాయి. మరి తాజా అధ్యయనం చెప్తున్నదేంటి? ఆయా ప్రభావాలు నిజమేనా?

ఈ నిరంతర కాలుష్య కారకాలపై ఆందోళన చెందాల్సిన అవసరముందని జంతు (Animal test)పరీక్షలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, 10 మంది వ్యక్తులతో చేపట్టిన కొత్త అధ్యయనంలో (Research), దుస్తులపై టొబాకో (Tobacco)స్మోక్ అవశేషాలు మంటతో సంబంధమున్న బయోమార్కర్ల (Bio worker)ను పెంచుతాయని, చర్మ వ్యాధుల (skin) విధానాలను అనుకరిస్తాయని తేలింది. ఈ వాలంటీర్లలో ఎవరికీ కాంటాక్ట్ డెర్మటైటిస్, సోరియాసిస్ (Contact dermatitis, psoriasis)వంటి చర్మ వ్యాధులు తలెత్తనప్పటికీ, చర్మానికి చేసిన హాని మరింత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు చెప్పారు. ‘మా థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్‌పోజర్స్ (Our third-hand smoke exposures) క్లుప్తంగా ఉన్నాయి. చర్మానికి చికాకు కలిగించలేదు, చర్మ వ్యాధిని ప్రేరేపించే అవకాశం లేదు. అయినప్పటికీ కాంటాక్ట్ డెర్మటైటిస్ (Contact dermatitis), సోరియాసిస్, ఇతర చర్మ పరిస్థితులకు సంబంధించి ప్రారంభ-దశ క్రియాశీలతకు సంబంధించిన గుర్తులు పెరిగాయి’ అని పరిశోధకులు తమ స్టడీలో (Study)నివేదించారు.

(Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..)

చర్మం ద్వారా థర్డ్ హ్యాండ్ స్మోక్ పార్టికల్స్

పరిశోధకులు 22 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల 10 మంది ఆరోగ్యవంతులైన, ధూమపానం చేయని వ్యక్తులపై అధ్యయనం చేశారు. ప్రతి ఒక్కరినీ మూడు గంటల పాటు ధూమపానం ద్వారా ప్రభావితమైన దుస్తులను ధరించమని కోరారు. అలాగే ప్రతి గంటకు ట్రెడ్‌మిల్‌ (Treadmill)పై 15 నిమిషాలు గడపాలని కూడా వారిని కోరారు. తద్వారా చెమట నుంచి చర్మం ద్వారా ఎక్కువ థర్డ్-హ్యాండ్ స్మోక్ పార్టికల్స్ (particles)తీసుకోబడతాయి. ఆ తర్వాత వారి బ్లడ్ (Blood), యూరిన్ (Urine)శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తే.. డీఎన్‌ఏ (DNA)కు ఆక్సీకరణ నష్టాన్ని సూచించే బయోమార్కర్లు పెరిగినట్లు రీసెర్చర్స్ టీమ్ కనుగొంది. రక్తంలో ప్రోటీన్ స్థాయిల్లో మార్పులు కూడా కనుగొనబడ్డాయి. ఎక్స్‌పోజర్ తర్వాత 22 గంటల వరకు ఈ మార్పులు కొనసాగాయి. అదే 10 మంది పార్టిసిపెంట్స్ మరొక టెస్ట్ సెషన్‌లో వ్యాయామం (Exercise)కోసం శుభ్రమైన దుస్తులను ధరించినప్పుడు మాత్రం ఇలాంటి మార్పులేవీ గమనించబడలేదు.

భవిష్యత్ పరిశోధనలు అవసరం

థర్డ్-హ్యాండ్ పొగకు గురికావడం.. సిగరెట్ (Sigarate) తాగేవారిలో కొలిచిన రోగనిరోధక ప్రతిస్పందనల నష్టం, క్రియాశీలతను ప్రతిధ్వనిస్తుందని ఫలితాలు సూచిస్తున్నట్లుగా పరిశోధకులు నివేదిస్తున్నారు. అధ్యయనంలో పాల్గొనేవారిలో ఎవరూ వారి చర్మం లేదా ఆరోగ్యంలో మార్పులను చూపించనప్పటికీ, ప్రారంభ సూచికలైతే ఉన్నాయి. పైగా ఇప్పటివరకు మానవులు థర్డ్-హ్యాండ్ స్మోక్ ఎక్స్‌పోజర్‌కు ఎలా స్పందిస్తారనే దానిపై చాలా తక్కువ అధ్యయనాలు మాత్రమే జరిగాయి. వాటిలో ఏవీ కూడా చర్మం బహిర్గంత కావడంపై కలిగే సమస్యలను వివరించనందున తదుపరి పరిశోధనలు అవసరమని భావిస్తున్నారు.

  

(Loneliness:‘ఒంటరితనం’ ధూమపానం కన్నా ప్రమాదమే..)

స్మోకర్స్ నుంచి కారు కొనుగోలు చేసినా..

‘మీరు ధూమపానం చేసేవారు ఉపయోగించిన కారును కొనుగోలు చేసినట్లయితే, అది మీ ఆరోగ్యానికి కొంత హాని కలిగించవచ్చు. ఇక స్మోకింగ్‌కు అనుమతించే కాసినోకు వెళితే, అక్కడ మీ చర్మాన్ని థర్డ్-హ్యాండ్ పొగకు బహిర్గతం చేస్తున్నట్లే. గతంలో స్మోకర్ వాడిన హోటల్ (Hotel Room)గదికి కూడా ఇదే వర్తిస్తుంది’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సెల్ బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ (Cell biologist Pure Talbot of the University of California) వెల్లడించారు. మొత్తానికి థర్డ్-హ్యాండ్ స్మోక్ ఎక్స్‌పోజర్ నుంచి చర్మానికి ఎక్కువ ప్రమాదం ఉండవచ్చని పరిశోధకులు ప్రతిపాదించారు. ఎందుకంటే శరీరంలో ఇదే అతి పెద్ద అవయవం. కాబట్టి ప్రతి భాగాన్ని ఉపరితలాలు, తగిలే గాలి నుంచి రక్షించడం కష్టం. ప్రస్తుతం పరిమిత స్థాయిలో నిర్వహించబడిన ఈ అధ్యయనాన్ని దీర్ఘకాలం పాటు పెద్ద సమూహాల్లో ఎక్కువ మంది వ్యక్తులతో నిర్వహించాలని ఆశిస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్లు (Electronic cigarettes) చుట్టుపక్కల పర్యావరణం, జనాభాపై చూపే ప్రభావాలను కూడా పరిశీలించాలనుకుంటున్నారు. ఈలోగా ఈ అధ్యయనం ద్వారా కనుగొన్న విషయాలు.. థర్డ్-హ్యాండ్ స్మోక్ ప్రమాదాలపై ఇప్పటికే ఉన్న సాక్ష్యాలను జోడించడంలో, ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగ్గించే మార్గాల దిశగా పనిచేయడంలో సాయపడతాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -