end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంCM KCR:ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు
- Advertisment -

CM KCR:ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు

- Advertisment -
- Advertisment -
  • తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
  • విస్తృతస్థాయి సమావేశంలో స్పష్టం చేసిన కేసీఆర్
  • కూతురు కవితను బీజేపీ ఆహ్వానించినట్లు వెల్లడి


ఈ యేడాది తెలంగాణలో (Telangana) షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని సీఎం కేసిఆర్ (CM KCR) స్పష్టం చేశారు. ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ (TRS) విస్తృతస్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో (BJP)ఇక యుద్ధమే అంటూ దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక ప్రకటన చేశారు. మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ (Assembly)ఎన్నికలు జరగుతాయని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఎమ్మెల్యేలంతా (MLA) నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మంత్రులు (Ministers) జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలని.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లను నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నిమించాలన్నారు. పది రోజుల్లో ఇన్‌ఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. మూడోసారి అధికారం మనదే.. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు.

(Sensation Video:అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డ్యాన్స్)

చివరికి నా కూతురినే పార్టీ మారమని అడిగారు:


చివరికి తన కూతురు ఎమ్మెల్సీ (MLC) కవితను (Kavitha) కూడా పార్టీ మారమని అడిగారని అన్నారు. టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా.. అంటూ సీఎం కేసీ ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మీపై ఈడి (ED)దాడులు చేస్తే తిరంగబడండని పిలుపునిచ్చారు. ఎన్నికలకు పది నెలలే ఉందని.. ఇక బీజేపీతో పోరాడాల్సిందే అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ నుంచి ఎదుర‌య్యే దాడిని స‌మ‌ర్థంగా తిప్పికొట్టాలని హితవు పలికారు. బీజేపీతో పోరాడాల్సిందేన‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వాల‌ను కూల‌గొట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.. మ‌న ద‌గ్గర కూడా ప్రయ‌త్నించి అడ్డంగా దొరికారని గుర్తు చేశారు. ఆ పార్టీ కుట్రల‌న్నింటినీ తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తోంద‌న్నారు. సీబీఐ (CBI), ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మంత్రులకు క్లాస్ పీకారు సీఎం కేసీఆర్. బీజేపీపై మీరు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

కొందరు ఎమ్మెల్యేలను మార్చుతారని వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్రస‌క్తే లేద‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు (Tickets) ఇస్తామ‌ని తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల (Months) స‌మ‌యమే ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు నియోజవర్గంలో ఉంటూ.. ప్రజల మధ్య ఉండాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలని.. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో ముందస్తుపై ఉన్న పుకార్లకు చెక్ పడింది.

(Blood developed in the lab:ల్యాబ్‌లో రక్తం డెవలప్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -