end
=
Wednesday, May 15, 2024
వార్తలుఅంతర్జాతీయంSensation Video:అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డ్యాన్స్
- Advertisment -

Sensation Video:అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డ్యాన్స్

- Advertisment -
- Advertisment -

  • వరల్డ్ సెన్సేషన్‌గా ‘ట్రిపుల్ ఘెట్టో కిడ్స్’ డ్యాన్స్ గ్రూప్
  • పేదపిల్లల జీవితాల్లో ఉగాండా ఎన్జీవో వెలుగు రేఖలు
  • డ్యాన్స్ ఉపయోగించి విద్యనందించడమే ప్రధాన లక్ష్యం
  • జీవితంలో మరో చాన్స్ కల్పిస్తున్న ఫౌండర్ కవుమా

ప్రపంచవ్యాప్తంగా (world wide) అనేక మంది యువత అడ్డంకులను ఛేదిస్తూ, మార్పును సృష్టిస్తున్నారు. ఈ యంగ్ చేంజ్ మేకర్స్‌ (Young Change Makers) కు సంబంధించిన విశేషమైన కథలు, లఘు చిత్రాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రధానంగా యూనివర్సల్ లాంగ్వేజ్‌ (Universal language) అయిన నృత్యానిది ఇందులో సింహ భాగం. వయోబేధం లేకుండా అన్ని నేపథ్యాల ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. డ్యాన్స్ పవర్.. ఆయా కమ్యూనిటీలకు ప్రేమ, ప్రోత్సాహంతో పాటు మెరుగైన, సజీవ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం ఉగాండాకు చెందిన ‘ట్రిపుల్ ఘెట్టో కిడ్స్’ (‘Triple Ghetto Kids’) డ్యాన్స్ గ్రూప్ కమ్ ఎన్జీవో (NGO) అదే పనిచేస్తోంది. పేద పిల్లలకు డ్యాన్స్ (Dance) కళను పరిచయం చేసి ఖండాంతర ఖ్యాతిని, తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది.

ట్రిపుల్ ఘెట్టో కిడ్స్ : (Triple Ghetto Kids)

ఉగాండా, కంపాలాలో ఉన్నటువంటి డ్యాన్స్ గ్రూప్ కమ్ ఎన్జీవో ‘ట్రిపుల్ ఘెట్టో కిడ్స్(TGK)’. పేద పిల్లలకు గృహాలు, ఆరోగ్య సంరక్షణ, ఆహారంతో పాటు విద్యను అందించే ఏకైక లక్ష్యంతో కవుమా దౌడ (Kawuma Dauda) అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. వెనుకబడిన పిల్లలు, అనాథలు, వీధి బాలల జీవితాలను డ్యాన్స్ ద్వారా మెరుగుపరచడమే ఈ మిషన్ లక్ష్యం. అంతేకాదు ఎవరైనా ‘డ్యాన్స్ చేసినప్పుడు ఆకలి సహా ప్రతిదీ మర్చిపోయి కేవలం ఆ కళపైనే దృష్టి పెడతారు’ అనేది ఈ గ్రూప్ ఫౌండర్ కవుమా (Kawuma is the founder of the group) అభిప్రాయం.

(Dirtiest Man Died : ప్రపంచంలోనే మురికైన మనిషి మృతి)

కవుమా ఇన్‌స్పిరేషన్ :

పిల్లలు తమను తాము ఆనందించేలా ప్రోత్సహించేందుకు కవుమా డ్యాన్స్ ఉపయోగిస్తాడు. కానీ ప్రధాన లక్ష్యం మాత్రం విద్యను అందించడమే. అప్పుడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కవుమా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లే స్థోమత లేదు. చాలా చిన్న వయస్సులోనే అతని తండ్రి చనిపోవడంతో అతని కుటుంబం అవసరాలు తీర్చడానికి చాలా కష్టపడింది. స్కూల్ (school fees) ఫీజు కట్టలేక వీధుల్లో ఫుట్ బాల్ (Foot ball) ఆడుతూ గడిపాడు. ఆ సమయంలో ఒక పాఠశాల ఫుట్‌బాల్ కోచ్ (coch) కవుమా వీధిలో ఆడుతుండటం గమనించి అతనికి మెరుగైన జీవితాన్ని అందించే అవకాశం కల్పించాడు. ‘నేను నీకు అవకాశమిస్తే.. తిరిగి పాఠశాలకు వెళ్తావా? అని అడిగాడు. అలా జీవితంలో ఒక అవకాశం పొందిన కవుమా.. పెద్దయ్యాక కనీసం ఒకరికైనా సాయం చేస్తానని తనకు తాను వాగ్ధానం చేసుకున్నాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు.

మరొక జీవితంలో అవకాశం సృష్టించడం :

డ్యాన్స్ గ్రూప్‌లోని చాలా మంది పిల్లలు అనారోగ్యం, పేదరికంతో బాధపడుతున్నారు. ట్రిప్లెట్స్ ఘెట్టో కిడ్స్ (Triplets Ghetto Kids) సభ్యురాలు నబకూజా (Nabakooza Patricia) ప్యాట్రిసియాకు ఐదుగురు తోబుట్టువులు ఉండటంతో వారందరినీ పాఠశాలకు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదు. దీంతో తోబుట్టువులు వంతులవారీగా తరగతులకు హాజరవుతారు. డబ్బు (money) లేనప్పుడు చాలా కాలం పాటు పాఠశాలకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం సీనియర్ హై స్కూల్ లెవెల్ స్టూడెంట్ (Senior high school level student), 18 ఏళ్ల ప్యాట్రిసియాను జీవితాన్ని TGK మార్చేసింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న తెలుసుకున్న డ్యాన్స్ టీచర్ కవుమా.. తనను ‘ట్రిపుల్ ఘెట్టో కిడ్స్‌’కు పరిచయం చేశాడు. ఆమె గ్రూప్‌లో భాగమైతే స్కూల్ ఫీజులు, బట్టలు, ఆహారం అన్నీ అందించబడతాయని చెప్పాడు. డ్యాన్స్‌ను కొనసాగించడం ఈ ఒప్పందంలో భాగం కాగా అప్పటి నుంచి ప్యాట్రిసియా ఇక వెనుదిరిగి చూడలేదు.

వీధుల నుంచి ప్రపంచ వేదిక వరకు

ట్రిపుల్స్ ఘెట్టో కిడ్స్.. ఈ పిల్లలకు ఒక వేదిక సహా విద్యను అందించడం కంటే ఎక్కువే చేసింది. ఇంటర్నేషనల్ స్టార్స్‌ (International stars)గా ఎదిగేందుకు వారికి సాయపడింది. ఈ గ్రూప్.. తమ డ్యాన్స్ వీడియోలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. 2013లో ఈ వీడియోల్లో ఒకటి, ఎడ్డీ కెంజో ‘సిటియా లాస్’ (‘City Loss’) పాటకు వారు చేసిన డ్యాన్స్ కవర్.. యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ (Trending on YouTube and Social Media) లో నిలిచింది. అప్పటి నుంచి అలాంటి వీడియోలు ఎన్నో అంతర్జాతీయంగా (Internationally) సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే గ్రూప్ సభ్యులు యూఎస్ (US Talk show) టాక్ షోలో హోస్ట్ జిమ్మీ ఫాలన్ (Jimmy Fallon) ద్వారా ఇంటర్వ్యూ చేయబడ్డారు. సింగర్ ఫ్రెంచ్ మోంటానా (Singer French Montana)తో కలిసి ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ప్రపంచాన్ని చుట్టేసే స్థాయికి ఎదిగారు.

టీజీకే ఫ్యామిలీ :

టీజీకే (TGK) సభ్యులు ఒక ఫ్యామిలీలా కలిసి ఉండటం అనేది ఈ గ్రూప్‌కు సంబంధించిన ఉత్తమ విషయాల్లో ఒకటి. వారు కవుమాను తండ్రిగా, గురువుగా చూస్తారు. గ్రూప్ సభ్యులను తోబుట్టువులుగా, శ్రేయోభిలాషులుగా చూస్తారు. ‘నేను పడుతున్న కష్టాల నుంచి కవుమా నన్ను రక్షించాడు. నేను మాత్రమే కాదు, ట్రిపుల్ ఘెట్టో పిల్లల్లో ప్రతి ఒక్కరినీ పెంచిన తండ్రి తనే’ అని ప్యాట్రిసియా చెప్పింది. ‘ట్రిపుల్ ఘెట్టో పిల్లలు నాకు ఒక కుటుంబం (Family). ఎందుకంటే నేను వారితో కలిసి పెరిగాను’ అని మరొక సభ్యుడు న్యాంగోమా రుసియా (Nyangoma Rusia)తెలిపాడు.

(Lorikeets:ఆకాశం నుంచి రాలిపడుతున్న చిలుకలు..)

ట్రిపుల్ ఘెట్టో కిడ్స్.. ఉగాండాలో మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపించారు. తమ ప్రతిభతో ప్రపంచాన్ని తుఫాన్ మాదిరిగా షేక్ (Shake)చేశారు. తమ కీర్తి, గుర్తింపును గొప్ప మంచి కోసం ఉపయోగించాలని భావిస్తారు. సమాజంలో కష్టాల్లో ఉన్న ఇతరులకు సాయంచేయడం ద్వారా కవుమా వారసత్వాన్ని కొనసాగించడమే వారి లక్ష్యం. ప్రస్తుతం ఈ పిల్లల భవిష్యత్తు గతంలో కంటే ఉజ్వలంగా ప్రకాశిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -