end
=
Monday, April 29, 2024
వార్తలుఅంతర్జాతీయంCurrent Affairs:త్వరలోనే ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ ప్రారంభం!
- Advertisment -

Current Affairs:త్వరలోనే ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ ప్రారంభం!

- Advertisment -
- Advertisment -

  • ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు’లో మోడీ ప్రసంగం

భారత్, ఆస్ట్రేలియాతో ( India and Australia) కలిసి ఇండో -పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం కలిగించే ఓ బలమైన శక్తిగా కొనసాగేలా క్వాడ్‌ను బలోపేతం చేస్తామని అమెరికా, జపాన్ (America, Japan) పేర్కొన్నాయి.

  • భారత్‌తో కలిసి క్వాడ్ (Quad) బలోపేతం చేస్తామన్న అమెరికా, జపాన్ (America, Japan)
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిద వైట్ హౌజ్‌లో (US President Joe Biden and Japanese Prime Minister Kishida at the White House) సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా, భారత్‌తో కలిసి క్వాడ్ ఒక శక్తిగా కొనసాగేలా చూస్తామని పేర్కొన్నారు.
  • క్వాడ్ లో అమెరికా, జపాన్ తో పాటు భారత్, ఆస్ట్రేలియాలు సభ్య దేశాలు.
  • ఇండో- పసిఫిక్ (Indo-Pacific) ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేస్తూ స్వేచ్చాయుత సముద్ర వాణిజ్యం కొనసాగేలా చేయడమే లక్ష్యంగా క్వాడ్ ఏర్పడింది.

అమెరికాలో సెనేటర్‌గా భారతీయ అమెరికన్:
డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి (Usha Reddy is an Indian American who belongs to the Democratic Party) కాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్ గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ కాలంగా ఆ పదవిలో ఉన్న టామ్ హాక్ స్థానంలో ఆమె పదవి చేపట్టారు. ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ (Educational Leadership)అంశంపై మాస్టర్స్ చేసిన ఉషారెడ్డి గతంలో రెండు సార్లు మేయర్‌ (Mayor)గా పనిచేశారు.

సచ్చిదానందన్‌కు కన్షయ్యాలాల్ సేఠియా కవిత్వ అవార్డు:
ఆధునిక మళయాళ కవి, అనువాదకుడు కె.సచ్చిదానందన్‌ (K. Satchidanandan)ను ‘8వ మహాకవి కన్హయ్యాలాల్ సేఠియా కవిత్వ అవార్డు’ వరించింది. త్వరలో జరగనున్న 16వ జైపూర్ సాహిత్య ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాజస్థానీ – హిందీ (Rajasthani – Hindi) కవి కన్హయ్యాలాల్ పేరిట నెలకొల్పిన ఫౌండేషన్ ఆయనకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ఒక మెమెంటోను బహూకరిస్తుంది.

  • సచ్చిదానందన్ కేంద్ర సాహిత్య అకాడమీ, కేరళ సాహిత్య (Satchidanandan Central Sahitya Academy, Kerala Sahitya) అకాడమీ అవార్డులను అందుకున్నారు.

త్వరలో ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు ప్రధాని మోడీ:

  • భారత్ ప్రంపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు.
  • వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ (Voices of the Global South) సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించారు.
  • ఈ సందర్భంగా కరోనా సమయంలో మేడిన్ ఇండియా టీకాలతో ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.
  • త్వరలో ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
  • ఇతర దేశాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా తాము అత్యవసర వైద్య సామాగ్రి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.
  • అంతరిక్ష, శాస్త్ర రంగాల్లోనూ (In the fields of space and science)భారత్ నైపుణ్యాన్ని ఇతర దేశాలతో పంచుకుంటుందని తెలియజేశారు.

(Indian Army:Indian Armyలో SSC ఆఫీసర్లకు నోటిఫికేషన్!)

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు:

  • భారత దేశం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు (Voices of the Global South Summit) ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోడీ వర్చవల్ గా ప్రసంగించారు.
  • ఉక్రెయిన్ యుద్ధం (ukraine war), ఉగ్రవాదం, వాతావరణ మార్పుల కారణంగా ఆహారం, ఇంధన భద్రత పరంగా సవాళ్లు మరింత పెరిగాయన్నారు.
  • మనలాంటి వర్ధమాన దేశాలు ఈ సమస్యల్ని సృష్టించకపోయినా వాటి పరిణామాలను మాత్రం అనుభవించాల్సి వస్తోందని అన్నారు.
  • యుద్ధాలు, ఘర్షణలు, ఉగ్రవాదం, రాజకీయ సంక్షోభాల ప్రభావాలు మనపై పడుతున్నాయని ఆయన చెప్పారు.
  • ఈ ఏడాది జి-20 సదస్సు (G-20 Summit)కు భారత్ అధ్యక్షత వహిస్తున్నందున గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
  • ప్రపంచానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చి స్పందించు (Respond), గుర్తించు (Recognize), గౌరవించు (Respect), సంస్కరించు (Reform) అనేది * ప్రపంచ ఎజెండాగా మారేలా చూడాలనీ, ఐరాస సహా అంతర్జాతీయ సంస్థలన్నింటినీ సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -