end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంcontract employees:కాంట్రాక్టు ఉద్యోగులకు మళ్లీ నిరాశే
- Advertisment -

contract employees:కాంట్రాక్టు ఉద్యోగులకు మళ్లీ నిరాశే

- Advertisment -
- Advertisment -

  • పెండింగ్‌లోనే రెగ్యులరైజేషన్ ఫైల్

Regularization of contractual employees: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఫైల్ (File pending) పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఫైల్ క్లియర్ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తే రాజకీయ ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబరులో కాంట్రాక్టు ఎంప్లాయీస్ సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో అధికారులు అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి ఫైల్ రెడీ చేశారు. సర్వీస్ క్రమబద్ధీకరణ చేస్తూ జీవో ఇచ్చేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్న టైమ్‌లో ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టాలని ప్రగతిభవన్ (Pragatibhavan) వర్గాల నుంచి ఆదేశాలు రావడంతో పక్కన పెట్టినట్టు సెక్రటేరియట్ (Secretariat) వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్రం ఏర్పడేనాటికి అన్ని శాఖల్లో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు లెక్కలు తీశారు. అయితే ఇందులో సాంక్షన్ పోస్టుల్లో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (In Sanctioned Posts, Rule of Reservation) మేరకు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య సుమారు 9 వేల వరకు ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, జాయినింగ్ డేట్‌తో (With Personal Details, Qualifications, Joining Date) పాటు ఇతర వివరాలు సేకరించారు. అయితే విద్యాశాఖలోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో (Degree, Junior and Polytechnic Colleges)కలుపుకుని మొత్తం 4770 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ తర్వాత వైద్యశాఖలో సుమారు 2.5 వేల మంది పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

(Current Affairs:త్వరలోనే ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ ప్రారంభం!)

ఆక్టోబర్ (October) రెండో వారంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు వచ్చే చాన్స్ ఉంది. అందుకు నెల రోజుల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల ఫైల్‌ను క్లియర్ (file clear)చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైల్‌పై సీఎం కేసీఆర్ (CM KCR SIGN) సంతకం చేసిన వెంటనే ప్రయోజనం పొందే కాంట్రాక్టు ఎంప్లాయీస్‌తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్లాన్‌లో సర్కారు ఉన్నట్టు తెలిసింది. సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసినందుకు కాంట్రాక్టు ఎంప్లాయీస్ కుటంబ సభ్యులతో మీటింగ్ నిర్వహించి, అందులో సీఎం కేసీఆర్‌కు థాక్స్ చెప్పడం ఏకైక ఎజెండాగా ఉన్నట్టు తెలిసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -