end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Sex:శృగారంతో ఊహించని ఉపశమనం
- Advertisment -

Sex:శృగారంతో ఊహించని ఉపశమనం

- Advertisment -
- Advertisment -

  • పలు సర్వేల ఆధారంగా వెల్లడించిన నిపుణులు
  • గుండె సంబంధిత వ్యాధులు రానివ్వదని వెల్లడి


ఈ రోజుల్లో గజిబిజి గందరగోళంగా ఉంటున్న జీవితంలో ప్రశాంతంగా నిద్రలేని(Sleepless) రాత్రులను ఎన్నో గడుపుతున్నారు మనుషులు. ఒత్తిడి లేదా నిరంతరం మెదడులో పరిగెత్తే ఆలోచనలు మనసుకి ప్రశాంతతనివ్వట్లేదు. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ శృంగారంలో పాల్గొంటే మెదడు, మనసుకు ఊహించని ఉపశనమనం(Relief) లభిస్తుందంటున్నారు నిపుణులు. సెక్స్ చేయడం ద్వారా శరీరం రిలాక్స్ మోడ్‌(Relaxmode)లోకి వెళ్లిపోతుందని, తద్వారా వద్దనుకున్నా నిద్ర ముంచుకోస్తుందని పలు సర్వేల్లో తేలినట్లు వెల్లడించారు.

‘సెక్స్ తర్వాత మన శరీరంలో ఎండార్ఫిన్‌(Endorphin)లు మరింత పెరుగుతాయి. ఇవి మంచి నిద్రకు ఉపక్రమిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్ది సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతుందనేది వాస్తవమే. కానీ, అలా తగ్గిన వారుకూడా వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్(Immunoglobulin) అనే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్‌లో యాక్టివ్‌గా ఉండేవారు ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు. శృంగారం కారణంగా శరీరంలో విటమిన్ ‘డి’ కూడా విడుదల అవుతుంది’ అని సెక్సాలాజిస్టులు పేర్కొన్నారు.

ఈ మేరకు తాజాగా 24 మంది స్త్రీలు, 22 మంది పురుషుల మీద చేసిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. రెగ్యులర్‌గా శృంగారం(Sex)లో పాల్గొనే మహిళలలో రుతుక్ర సమస్యలు తగ్గిపోతాయి. వారిలో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ప్రేగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శృంగారం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్(Depression) వంటి మానసిక సమస్యలని దూరం చేసుకోవచ్చు. తరుచూ సెక్స్ చేసే వారి మెదడు మాత్రమే కాదు, శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. తరుచూ సెక్స్ చేయడం వల్ల ఉత్పత్తయ్యే న్యూరోట్రాన్స్మీటర్లు(Neurotransmitters) మెదడు పనితీరును మెరుగుపరుస్తాయట. శారీరక, మానసిక వికాసానికి ఇది తోడ్పడటంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్నాయి.

(Sex:సెక్స్‌తోనే చర్మ సౌందర్యం..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -