end
=
Wednesday, May 15, 2024
వార్తలుజాతీయంActress Gayathri Raghuram:బీజేపీలో మహిళలకు భద్రత లేదు
- Advertisment -

Actress Gayathri Raghuram:బీజేపీలో మహిళలకు భద్రత లేదు

- Advertisment -
- Advertisment -
  • మాకు గౌరవమర్యాదలు అసలే లేవు
  • అందుకే పార్టీ నుంచి వైదొలగుతున్నా
  • నటి గాయత్రి రఘురాం సంచలన ఆరోపణలు

సీనియర్‌ నటి గాయత్రి రఘురాం(Senior actress Gayathri Raghuram) త‌మిళ‌నాడు (Tamil Nadu) బీజేపీ (BJP) పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర బీజేపీలో మహిళలకు భద్రత లేదని, గౌరవమర్యాదలు అసలే లేవని, అందుకే తాను బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్‌ (Twitter) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె.. రాష్ట్ర బీజేపీలో మహిళా హక్కులకు భంగం కలుగుతోందని వాపోయింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (State President Annamalai)పై సంచలన ఆరోపణలు చేశారు. అన్నామలై నేతృత్వంలోని పార్టీలో నిజమైన విశ్వాసులకు ఎలాంటి గుర్తింపు లేదని, పార్టీ కోసం కృషి చేస్తున్న వారిని ఆయన పని కట్టుకుని బయటకు పంపించేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీకి తాను రాజీనామా చేయడానికి అన్నామలైయే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే అన్నామలై(Annamalai) గుట్టు రట్టు చేస్తానని, అందుకు సంబంధించిన ఆడియో, వీడియోలను పోలీసులకు ఇస్తాన (I will give the audio and video to the police)ని, వాటిని పరిశీలించి అన్నామలైపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రధాని మోదీ భారత దేశానికే తండ్రివంటి వారని, ఆయన తన విశ్వగురువని వ్యాఖ్యానించారు.

ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్ల పార్టీకి ముప్పు వుందంటూ విమర్శలు చేశారు. అంతేగాక కాశీ-తమిళ (Kashi-Tamil) సంమం కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై కూడా ఆమె నిరసన తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నామలై.. ఆమెను పార్టీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె అన్నామలై తీరును కూడా తప్పు బట్టారు. పార్టీ నుంచి తప్పించినందుకు వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. సస్పెండ్‌ చేసినా పార్టీ అభివృద్ధి కోసం పాటు పడతానని స్పష్టం చేశారు. మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు, హ‌క్కులు, గౌర‌వం క‌ల్పించ‌నందున భార‌మైన హృద‌యంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. అన్నామ‌లై నాయ‌క‌త్వంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్రత లేద‌ని, పార్టీలో ఉండ‌టం కంటే బ‌య‌ట‌నుంచి ట్రోలింగ్‌కు గురికావ‌డం మెరుగ‌నిపిస్తోంద‌ని ప్రధాని న‌రేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా, ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌ను (Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Party National President JP Nadda and General Secretary BL Santosh) ట్యాగ్ చేస్తూ గాయ‌త్రి ట్వీట్ చేశారు.

అలాగే బీజేపీ అగ్రనేత అమిత్‌ షా (Amit Shah)ను తన రాజకీయ గురువుగా పేర్కొన్న గాయత్రి పార్టీలో ఎనిమిదేళ్లుగా (8Years)తనతో ప్రయాణించిన నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు (leaders and workers). రాష్ట్ర బీజేపీలో గాయత్రి రఘురాం (Gayatri Raghuram) రాజీనామా వ్యవహారం చర్చనీయాంశమైంది. ఎనిమిదేళ్లుగా గాయత్రి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో విదేశీ తమిళుల సంక్షేమ విభాగ అధ్యక్షురాలిగా(As the Chairperson of Tamil Welfare Department) వ్యవహరించిన ఆమె.. పలువురి ప్రశంసలందుకున్నారు. అయితే గత ఏడాది బీజేపీ రాష్ట్ర ఓబీసీ (OBC)విభాగ మాజీ ప్రధాన కార్యదర్శి సూర్యశివ, మైనారిటీ విభాగ చైర్మన్‌ డెయిసీ (Surya Siva, Minority Section Chairman Daisy) మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయట పడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గాయత్రి రఘురాం.. సూర్య (surya)పై చర్యలు తీసుకోవాలంటూ బహిరంగంగానే డిమాండ్‌ చేశారు.

ఇదిలా వుండగా గాయత్రి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని ప్రముఖ సంగీత దర్శకుడు దినా (Dina is the music director)కు అప్పగించారు. దీనిపైనా ఆమె మండిపడ్డారు. తనను కేవలం ఆరు నెలల పాటే సస్పెండ్‌ (Suspended for six months)చేయాలన్న ఉద్దేశముంటే అంతలోకే తన పదవిలో మరో వ్యక్తిని ఎలా కూర్చోబెడతారని కూడా ప్రశ్నించారు. కాగా తనపై వున్న సస్పెన్షన్‌ను తొలగించాలంటూ ఢిల్లీ(Dellhi) వెళ్లి కీలక నేతలతోనూ మాట్లాడారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆమె పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా గాయత్రి రఘురాం బీజేపీ నుంచి వైదొలగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అన్నామలై గుట్టు బయటపెడతానంటూ ఆమె చేసిన ప్రకటన బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

(Demonetisation:‘నోట్ల రద్దు’ తప్పుడు నిర్ణయమే)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -