ప్రజల కష్టాల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు ఆరోపించారు. ఓవైపు కరోనా విజృంభన, మరోవైపు వర్షాల వల్ల వరదలు వచ్చి జనం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీల నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు.
వరద నీటి నిర్వహణ, విపత్తు నిర్వహణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర జలసంఘం చేసిన వరద హెచ్చరికలను పట్టించుకోలేదని తెలిపారు. వరద బాధితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో తిత్లీ తుఫాను సమయంలో వరద బాధితులను ఎలా ఆదుకున్నామో వివరించారు. ఎంతో మంది నిరాశ్రయులకు సుమారు 1,35,650 మందికి భోజనాలు పెట్టినట్లు గుర్తు చేశారు.
జపాన్ ప్రధాని పదవికి షింజో రాజీనామా
ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజల బాధలను, కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరదల వల్ల పంట నష్టం జరిగిందని వెంటనే బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చాలా మంది వరద బాధితులకు టీడీపీ తరపున ఆదుకున్నామని తెలిపారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడతామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.