మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ప-రదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ వాతావరణం, ఒక సాహసయాత్ర నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. చిత్రంలో అనుపమ నటన సహజంగా ఉందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ‘ప-రదా’ లాంటి విభిన్నమైన కథాంశాలతో వచ్చే చిత్రాలను ప్రోత్సహించాలని నిర్మాతలు, దర్శకులకు పిలుపునిచ్చారు. సినిమాలో అనుపమ అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా అనుపమ సినీ కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. దర్శకుడు ప్రవీణ్, నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో ప్రేక్షకులు ‘అనుపమ 2.0’ ని చూడబోతున్నారని, రివ్యూలు బాగుంటేనే సినిమా చూడాలని కోరారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఈనెల 22న తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది.