end
=
Monday, April 29, 2024
వార్తలుఅంతర్జాతీయంCOVID: 80 శాతం మంది కోవిడ్ బాధితులే!
- Advertisment -

COVID: 80 శాతం మంది కోవిడ్ బాధితులే!

- Advertisment -
- Advertisment -

చైనాలో ఇప్పటికే 80% ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారని తాజా లెక్కలు వెల్లడించాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్‌ యూనివర్సిటీ (Peking University) అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్​ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 141 కోట్ల డ్రాగన్​ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌ (Gansu province )లో 91 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

ప్రావిన్స్‌ తర్వాత యూనాన్‌ (Yunnan) ప్రాంతంలో 84 శాతం, కింఘై (Qinghai)లో 80 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు పేర్కొంది. కాగా, చైనా వ్యాప్తంగా మరో 2-3 నెలల వరకు కొవిడ్‌ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం డ్రాగన్‌ న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత మూడేళ్లుగా కొవిడ్‌ నిబంధనల మధ్య మగ్గిన చైనీయులు.. వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.


ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో తీవ్రదశ ఇంకా ముగియలేదని అక్కడ అధికారి ఒకరు తెలిపారు. వైరస్‌ విషయంలో ఇప్పటి వరకు ప్రాధాన్యత అంతా నగరాలపైనే ఉందని చెప్పారు. అయితే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చైనా (China) అధికారిక లెక్కల ప్రకారం జనవరి 12 నాటికి చైనా ఆసుపత్రుల్లో 60 వేల మంది మాత్రమే కోవిడ్ తో చనిపోయారు. చైనాలో కోవిడ్ 19 (COVID 19) ముప్పు దాదాపు ముగిసినట్లేనని ఆ దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు ప్రకటించారు. ఇప్పటికే దేశంలోని 80% ప్రజలు కొరోనా బారిన పడ్డారని, అందువల్ల మరో వేవ్ కు అవకాశం లేదని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (China Center for Disease Control and Prevention) లో చీఫ్ ఎపిడెమాలజిస్ట్ వు జున్యు వివరించారు. కేసుల సంఖ్యలో, మరణాల్లో భారీ పెరుగుదల నమోదయ్యే స్థితి దాటిపోయామని తెలిపారు. 80% ప్రజలు ఇప్పటికే కోవిడ్ 19 బారిన పడినందువల్ల, వారిలో కొరోనా నిరోధక శక్తి సహజంగానే వచ్చి ఉంటుందని వివరించారు. అందువల్ల, మరో 3, 4 నెలల వరకు కొత్తగా కొరోనా ( వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబో (Weibo)లో తెలిపారు.

చైనా (China)లో చాంద్ర మాన నూతన సంవత్సర (Lunar New Year) వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోట్లాదిగా ప్రజలు సొంత ఊర్లకు ప్రయాణమవుతారు. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ నూతన సంవత్సర (Lunar New Year) వేడుకలకు కచ్చితంగా సొంత ఊరికి చేరుకుంటారు. ఇందుకోసం లక్షల సంఖ్యలో ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల, ఈ సమయంలో కొరోనా వైరస్ (corona virus) వ్యాప్తికి ఎక్కువ అవకాశముందని, కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరిగే ముప్పుందని చైనా వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, కొరోనా (corona) ఔట్ బ్రేక్ కు సంబంధించినంతవరకు పీక్ స్టేజ్ దాటిపోయామని, ఆసుపత్రులు, ఫీవర్ క్లినిక్ లు, ఎమర్జెన్సీ రూమ్ ల్లో కోవిడ్ (COVID) పేషెంట్ల చేరికలు కూడా క్రమంగా తగ్గుతున్నాయని నేషనల్ హెల్త్ కమిషన్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. చైనా (China) అధికారిక లెక్కల ప్రకారం, జీరో కోవిడ్ పాలసీ (zero COVID policy)ని ఎత్తివేసిన నెల రోజుల్లో జనవరి 12 నాటికి చైనా ఆసుపత్రుల్లో 60 వేల మంది మాత్రమే కోవిడ్ (COVID) తో చనిపోయారు. అయితే, ఈ సంఖ్య నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు. ఇళ్లల్లో చనిపోయిన వారి వివరాలు అందులో లేవు. అదీకాకుండా, కోవిడ్ మరణాలుగా నిర్ధారించడానికి సంబంధించి వైద్యులపై కఠిన ఆంక్షలు కూడా విధించారు.

(Sikkim:ప్రభుత్వ ఉద్యోగినులకు వరాల జల్లు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -