- నవంబర్ 1 నుండి నవంబర్ 3 సాయంత్రం వరకు అమలు
- మునుగోడులో ఎన్నిక కోడ్
(TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత)
Munugode By Eelections : మునుగోడు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు వైన్స్‌లు బంద్ (Wines) చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. మనుగోడులో ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా మూడు రోజులపాటు అంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల అధికారి(Election Comission) ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని అన్ని వైన్‌షాపులు మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉప ఎన్నిక ప్రకటన అనంతరం మనుగోడు నియోజకవర్గంలో విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయని, మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా అక్రమంగా మద్య అమ్ముతున్న 48 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం 118 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
(TRS MLA Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు … నిందితుల రిమాండ్)