పత్తి కొనుగోళ్లలో ఒక క్వింటాకు రూ.2 వేల వరకు దోపిడీ
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
తెలంగాణలో కొనసాగుతున్న పత్తి కోనుగోళ్ల(Cotton sales)లో రూ.3 వేల కోట్ల కుంభకోణం(Rs.3000 crs scam) జరిగిందని, బ్రోకర్లు, ట్రేడర్ల ఖాతాలోకి ఆ సొమ్ము జమ అయిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Ex mla Peddi Sudarshan Reddy)ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లలో బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలంతా దీనిలో భాగస్వాములని ఆరోపించారు. వారంతా కలిసి పత్తి రైతులను ముంచుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు చివరికి ఆరుగాలం శ్రమించి, ప్రపంచానికి అన్నం పెట్టే రైతులను సైతం వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,500 మద్దతు ధర ఉండగా, దళారులు కేవలం రూ.5 వేలకే బేరం పెట్టి.. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని నిప్పులు చెరిగారు.
సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా స్పందించి పత్తి కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అక్టోబర్‌లోనే పత్తి సేకరణ జరిగేదని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని దుయ్యబట్టారు. బ్రోకర్లు, ట్రేడర్లు టీఆర్ నంబర్లతో అక్రమ ఖాతాలు సృష్టించి సీసీఐకి పత్తిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో క్వింటాపై రూ.2 వేలు దోచుకున్నారని మండిపడ్డారు. కుట్రలో భాగంగానే కొనుగోళ్లను ఆలస్యంగా ప్రారంభించారన్నారు.