end
=
Friday, June 20, 2025
వార్తలురాష్ట్రీయంగాజర్ల రవి​ మృతదేహం కోసం పడిగాపులు
- Advertisment -

గాజర్ల రవి​ మృతదేహం కోసం పడిగాపులు

- Advertisment -
- Advertisment -

రంపచోడవరంలో కుటుంబ సభ్యులు
ఇప్పటివరకు మృతదేహాన్ని చూపించలేదని ఆవేదన

ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతం(Maredumilli forest)లో గురువారం గ్రేహౌండ్​ దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పు(Fire of exchange)ల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆంధ్రా ఒడిశా బ్రాంచి (ఏవోబీ) గాజర్ల రవి(Maiost party top leader Gajarla ravi) అలియాస్​ ఉదయ్​తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

రవి​ స్వగ్రామం ఇప్పటి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. రవి​ ఎన్​కౌంటర్​ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు(Victim`s Family) బుధవారం అర్ధరాత్రే రంపచోడవరం చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రవి​ మృతదేహం స్వాధీనం కోసం నిరీక్షిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వారిలో రవి​ తమ్ముడు అశోక్​, అన్న సారయ్య తదితరులు ఉన్నారు.

సమాధానం కరువు..
రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి నుంచి నిరీక్షిస్తున్నామని, పోలీసులు కనీసం రవి మృతదేహాన్ని చూసేందుకైనా అనుమతించడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ మృతదేహం చెడిపోయే అవకాశాలు ఉంటాయని, త్వరగా మృతదేహాన్ని అప్పగిస్తే తమ స్వస్థలానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసుకుంటామని పోలీసులను కోరుతున్నారు.

దవాఖాన వద్ద సమాధానం చెప్పే వారే లేరని వాపోతున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యే సరికి గురువారం సాయంత్రమవుతుందని, ఆ తర్వాత రవి​ మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరోవైపు టేకులపట్ల మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, పౌర హక్కుల నేతలు, ప్రజాస్వామిక సంఘాల సభ్యులు రవి భౌతికదేహాన్ని కడసారి చూడాలని ఎదురుచూస్తున్నారు.

మృతదేహాన్ని చూపించడం లేదు..
బుధవారం అర్ధరాత్రి మేం రంపచోడవరం చేరుకున్నాం. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి సీఐ, ఎస్సైని కలిశాం. వారు రాత్రయిందని, ఉదయం పూట మృతదేహాలను చూడొచ్చని చెప్పారని వెల్లడించారు. గురువారం మళ్లీ పోలీసులను కలిశాం. వాళ్లు అప్పుడు.. ఇప్పుడూ అంటున్నారే తప్ప వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఒకసారి మృతదేహాన్ని చూపించాలని మేం కోరుతున్నాం. పోలీసులు ఇప్పటివరకు వరకు ముగ్గురు మృతదేహాల ఫొటోలను మీడియాకు విడుదల చేయలేదు. ఫోటోలు విడుదల చేయకపోవడంపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్​కౌంటర్​ జరిగింది వాస్తవమే అయినప్పుడు మృతదేహానికి సంబంధించిన ఫోటోలను ఎందుకు విడుదల చేయడం లేదని మేం ప్రశ్నిస్తున్నాం.

‌‌_ గాజర్ల అశోక్​, మృతుడు గాజర్ల రవి​ సోదరుడు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -