డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Director Shekar Kammula) తాజా చిత్రం ‘కుబేర’ (Kubera Movie) వెండితెరపై దుమ్మురేపుతూ (Celluloid Block Buster).. ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా చిత్రాన్ని చూసిన ప్రతిఒక్కరూ నట ధీరుడు ధనుష్, కింగ్ నాగార్జున (Actror Nagarjuna) నటనా కౌశలానికి ఫిదా అవుతున్నారు. ప్రేక్షకుల నుంచి చిత్రానికి వస్తున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ.. ‘సుమంత్, నాగచైతన్య, అమల.. ఇప్పటికే డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో పనిచేశారు. నాక్కూడా శేఖర్‌తో పనిచేయాలని ఉండేది. శేఖర్ కూడా నాతో స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని ఉందని చెప్పేవాడు. చివరకు ‘కుబేర’ నా దరికి వచ్చింది. శేఖర్ నా కోసం అద్భుతమైన పాత్ర సృష్టించాడు. చిత్రంలో నేను పోషించిన పాత్ర దీపక్ నాకెంతో నచ్చింది. సినిమాలో ప్రతి పాత్ర దీపక్ చుట్టూనే తిరుగుతుంది.
దీపక్ పాత్రలో మూడు రకాల కోణాలు ఉంటాయి. అందుకే నేను ఓకే చెప్పా. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ‘గుండమ్మ కథ’.. చిత్రాల్లో హీరో ఎవరంటే.. ఏమీ చెప్పలేం. కథే హీరో.. అవన్నీ డైరెక్టర్ చిత్రాలు. ‘కుబేర’ కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. సినిమా కోసం ఆయన ప్రాణం పోశారు’ అన్నారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా కొత్తగా చేద్దాం అనుకున్నా. చాలా వరకు అది చేశా. నాగార్జున కథ ఓకే చేయడం ఉత్సాహాన్నిచ్చింది. సరస్వతిదేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పా. అదే ఇప్పుడు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ అనుకుంటున్నా’ అని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.