తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉద్యోగులు (Employees), పెన్షనర్ల (Pensioners)కు శుభవార్త (Good news)చెప్పింది. వైద్య బిల్లులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు (Pending medical cleared) రూ.180.38 కోట్లను గురువారం రాత్రి ఒకేసారి విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 26,519 మందికి ఊరట లభించింది. వెరసి 2023 మార్చి 4వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్ 25 వరకు ఉన్న బిల్లలు క్లియర్ అయినట్లు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందిస్తూ..
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులకు ప్రాధాన్యతనిచ్చినట్లు వెల్లడించారు. 27 నెలలుగా మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించి… వాటిని విడుదల చేశామన్నారు. ఈనెల 13న ఇప్పటికే సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనని గుర్తుచేశారు.
డీఏ పెంపు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధిపొందుతారన్నారు. ఒక డీఏకు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.200 కోట్లు, ఏడాదికి రూ.2400 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అయినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.