end
=
Tuesday, July 1, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంఅశ్వగంధలో ఆరోగ్య రహస్యాలు
- Advertisment -

అశ్వగంధలో ఆరోగ్య రహస్యాలు

- Advertisment -
- Advertisment -

ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలామంది ఒత్తిడి (Mental Pressures), ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు డిప్రెష‌న్‌ (Depression Problems)కు దారి తీస్తాయి. ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే అశ్వ‌గంధ (Aswagandha Powder)మంచి ఔషధం. ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాస్ పాల‌లో అర టీస్పూన్ అశ్వ‌గంధ పొడి క‌లిపి తాగితే మ‌న‌సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్ నుంచీ బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

  • అశ్వ‌గంధ‌లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు (Contains Anti Oxidents) ఉంటాయి. ఇవి మెట‌బాలిజాన్ని పెంచుతాయి. క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూసేవారికి అశ్వ‌గంధ ఎంత‌గానో ప‌నిచేస్తుంది.
  • కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. ఆ స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ ఉద‌యం, సాయంత్రం అశ్వ‌గంధ పొడిని పాల‌లో క‌లిపి తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.
  • అశ్వ‌గంధ‌లో ఉండే ఔష‌ధ గుణాలు త‌ల‌నొప్పి, హైబీపీ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి. క‌నుక ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది.
  • జ్ఞాప‌క‌శ‌క్తిని, ఏకాగ్ర‌త‌ను పెంచ‌డంలో అశ్వ‌గంధ బాగా ప‌నిచేస్తుంది. అలాగే దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి త‌గ్గిపోతాయి.
  • అశ్వ‌గంధ‌లో క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ త‌గ్గుతాయి.
  • నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీస‌కోవ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అశ్వ‌గంధ పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. దీంతో వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. స్త్రీల‌కు నెల నెలా వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వాడే విధానం
1.పొడి (చూర్ణం)
మోతాదు: రోజుకు 1/2 టీ స్పూన్ (సుమారు 3 గ్రాములు)
ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. తేనెతోనూ కలిపి తీసుకోవచ్చు

2.గుళికలు 
మోతాదు: రోజుకు 1-2 టాబ్లెట్లు (500 mg – 1000 mg)
ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత

3.అశ్వగంధ ఘృతం / లేహ్యం
ఆయుర్వేద వైద్య సూచనల లేహ్యాన్ని తీసుకోవాలి. సాధారణంగా 5-10 గ్రాముల వరకు తీసుకోవచ్చు.

ఇట్లు
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్​ వెంకటేష్
9392857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -