కుంటపల్లిలో ‘అమ్మ’ దహనం
తాటికాయలలో మహిళపై అమానుషం
కాజీపేటలో వ్యక్తి దారుణ హత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం
ఉమ్మడి వరంగల్ జిల్లా (United Warangal District)లో ఒకేరోజు మూడు దారుణాలు (Three atrocities at a day) వెలుగు చూశాయి. ఆస్తి తాగాదాల నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లికి వ్యక్తి తల్లిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అక్రమ సంబంధం (Illegal affair) నెరపుతున్నదని ఓ మహిళను వివస్త్రను చేసి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామస్తులు హింసించారు.
డబ్బు లావాదేవీల (Economical Transasations) నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేటకు చెందిన ఓ వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య (Brutal Murder)చేశాడు. మూడు ఘటనలు ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించాయి.
తల్లిపై పెట్రోల్ పోసి దహనం..
వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా సతీశ్ అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున తన తల్లి వినోద (50) పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన గ్రామస్తులు, బంధువులు వెంటనే వినోదను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమెకు 85 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుర్తించారు.
సమాచారం అందుకున్న మెజిస్ట్రేట్ హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి వినోద నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తన కొడుకే ఆస్తి కోసం తనపై పెట్రోల్ పోసి నిప్పంటిచాడని వాంగ్మూలం ఇచ్చింది. మరోవైపు ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మహిళను వివస్త్రను చేసి హింస..
అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఓ వివాహితను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. ఈ అమానవీయ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పదేళ్ల క్రితం తాటికాయలకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. దంపతులకు ముగ్గురు సంతానం.
కాగా, వివాహిత కొద్దిరోజులుగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం నెరపుతున్నదనే అనుమానంతో గ్రామస్తులు ఆమెను బంధించారు. వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. మర్మాంగాలపై దాడి చేశారు. బాధితురాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా గ్రామస్తులు ఆమెను వదిలిపెట్టలేదు. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి విచారణ చేపట్టారు. తదుపరి వివరాలు తెలియరావాల్సి ఉన్నది.
వ్యక్తిని కత్తితో పొడిచి హత్య..
ఆర్థికపరమైన వివాదం నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేటలో దారుణహత్య జరిగింది. నవీన్ (38) తన భార్య మాధవితో కలిసి కాజీపేటలోని రైల్వక్వార్టర్స్లో నివసిస్తున్నాడు. నవీన్కుఇదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కు కొద్దిరోజులుగా రూ.40 వేల లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రవీణ్‌కుమార్ ఈ క్రమంలో నవీన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో ఉన్న నవీన్ను భార్య గుర్తించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే నవీన్ మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.