‘జీవితం కొన్నిసార్లు ఊహించని దారిలో తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, చర్చల తరువాత నేను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాను’ అని బ్యాడ్మింటన్ క్రీడాకారణి (Badminton Player) సైనా నెహ్వాల్ (Sainya Nehwal) తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram Post)లో రాసుకొచ్చారు. ఈ విషయంపై కశ్యప్(Kashyap) మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
సైనా, కశ్యప్‌కు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (Badminton Academy)లో కోచింగ్ జరుగుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరూ 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కశ్యప్ ఆటకు గుడ్‌బై చెబుతూ కేవలం కోచింగ్‌కు పరిమితమయ్యారు. సైనా 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలిచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమెకు పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున అవార్డు, ఖేల్ రత్న లాంటి ప్రతిష్టాత్మక గౌరవాలు లభించాయి.