end
=
Tuesday, July 15, 2025
రాజకీయంఆకలి తీర్చే ఆయుధం రేషన్‌ కార్డు
- Advertisment -

ఆకలి తీర్చే ఆయుధం రేషన్‌ కార్డు

- Advertisment -
- Advertisment -

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

రేషన్‌ కార్డు (Ration Card) పేదవాడి(Poor People) ఆత్మగౌరవాని (Self Respect Matter)కి ప్రతీక అని, అది ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఆదివారం నిర్వహించిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ (Card Issue Started) కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

నల్గొండ చరిత్రే తెలంగాణ చరిత్ర అని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా పేదల కోసం రేషన్‌ కార్డులు, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదని విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తుండటంతో రేషన్‌ దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరుతున్నారని వివరించారు. వ్యవసాయం దండగ కాదని, పండగ కావాలని రైతులకు గిట్టుబాటు ధరతోపాటు బోనస్‌ అందించామన్నారు.

దేశం తలెత్తుకునేలా తెలంగాణ వరి ఉత్పత్తి చేస్తుందన్నారు. గతంలో ప్రతిపక్ష నేతలు మూడు రోజుల్లో తుంగతుర్తికి గోదావరి జలాలు తెస్తామన్నారు కానీ పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీఎం అయ్యాక గోదావరి జలాలు తెస్తే అడ్డుకుంటామంటున్నారని విమర్శించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -