వయసు పెరిగితే అందం తగ్గుతుందన్న నిబంధనను చెరిపేసేస్తున్నారు బాలీవుడ్ బొద్దుగుమ్మ (Bollywood Beauty) విద్యాబాలన్ (Vidya Balan). నాలుగు పదుల వయస్సులోకి అడుగు పెట్టి, పెళ్లి చేసుకుని కూడా తాజాగా కాస్త డోసు పెంచారు. ఒకప్పుడు ‘డర్టీ పిక్చర్’ అనే చిత్రంతో అలరించిన ఈమె తాజాగా మరోసారి ‘పికాక్’ మ్యాగజైన్ (Peacock Magazine) కవర్ పేజీ (Cover Page)పై తళుక్కున మెరిశారు.
పింక్ డ్రెస్‌లో డీప్‌నెక్ క్లీవేజ్, మోడ్రన్ మేకోవర్, ముఖం నిండా ఉన్న ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న చిత్రాన్ని చూసి నెటిజన్లు ఫిదా (Crazy About Pics) అవుతున్నారు. ‘భలో థేకో’తో కెరీర్ ప్రారంభించిన ఈ నటి, బాలీవుడ్‌లో వరుసగా హిట్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. ‘డర్టీ పిక్చర్’ తర్వాత ఆమె క్రేజ్ ఇండియాలో మరింత పెరిగింది. ఆ మధ్య ఆరోగ్య సమస్యలతో ఆమె సతమతమయ్యారు. కాస్తంత బరువు పెరిగారు.
అయినప్పటికీ.. అన్ని సమస్యలను అధిగమించి, మళ్లీ తానేంటో నిరూపించునేందుకు సిద్ధమయ్యారు. మ్యాగజైన్ ఫోటోషూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.