end
=
Friday, August 1, 2025
సినీమాజాన్వీ ‌‌రొమాంటిక్​ సాంగ్​
- Advertisment -

జాన్వీ ‌‌రొమాంటిక్​ సాంగ్​

- Advertisment -
- Advertisment -

హీరోయిన్ల అందాన్ని తెరపై అందంగా ఆవిష్కరించడమంటే కేవలం కెమెరాతో కాదని, అది దర్శకుడి నైపుణ్యానికీ, సృజనాత్మకతకు సంబంధించిన విషయమని ‘ఉప్పెన’ చిత్రంతో నిరూపించిన దర్శకుడు (Director) బుచ్చిబాబు సానా (Buchibabu Sana).. ఇప్పుడు అదే మాయాజాలాన్ని పాన్​ ఇండియన్​ స్టార్ (Pan Indian Movie)​ రామ్‌చరణ్‌ (Ramcharan) నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం (Peddi Film)లో మరోసారి చూపించనున్నాడు.

‘ఉప్పెన’లో కృతిశెట్టిని అద్భుతంగా తెరపై చూపించిన బుచ్చిబాబు, ‘పెద్ది’లో జాన్వీ కపూర్​(Janvi Kapoor)నూ తనదైన శైలిలో అందంగా చూపించేందుకు సన్నద్ధమవుతున్నాడట. ‘దేవర’తో టాలీవుడ్‌కు పరిచయమైన జాన్వీకి అప్పట్లో ఎన్టీఆర్‌తో పూర్తి స్థాయి రొమాన్స్ చేసే అవకాశం రాలేదు. ‘పెద్ది’లో మాత్రం ఆమెకు చరణ్‌తో మంచి రొమాంటిక్ కెమిస్ట్రీ ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న

ఈ చిత్రంలో ఓ రొమాంటిక్ సాంగ్‌ రెడీ అవుతోంది. మొజార్ట్​ ఆఫ్​ మద్రాస్​ ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ గీతం ప్రేమికులను అలరించనున్నది. పాటపై దర్శకుడు బుచ్చిబాబు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఇక ఈ పాట చిత్రీకరణ ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది మార్చి 27 వరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -