end
=
Friday, August 1, 2025
సినీమా‘కాంతార’ రిషబ్​.. సితార కంబైన్స్​..
- Advertisment -

‘కాంతార’ రిషబ్​.. సితార కంబైన్స్​..

- Advertisment -
- Advertisment -

వైవిధ్యభరితమైన (Different Movies) చిత్రాలను అందిస్తూ వరుస విజయాల (Frequent Hits)తో దూసుకుపోతున్న టాలీవుడ్​ నిర్మాణ సంస్థ (Tollywood Makers) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainment), ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి (Actror Risab Setty)తో ఆ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నది.

ప్రస్తుతం ‘కాంతార 2’ చిత్ర పనుల్లో బిజీ బిజీగా ఉన్న రిషబ్, త్వరలో ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా (Fictional Historical Action Drama) కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని సితార సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో చిత్ర కథ ఉంటుందని సమాచారం.

కన్నడలో మంచి కథకుడైన అశ్విన్ గంగరాజు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ఏకకాలంలో తెలుగు, కన్నడలో రూపుదిద్దుకోనున్నది. అలాగే తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ డబ్బింగ్​ వెర్షన్​ విడుదల కానున్నది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్రం కోసం పని చేయనున్నారు. త్వరలో మేకర్స్​ ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -