end
=
Friday, August 8, 2025
వార్తలుజాతీయంఆ విషయంలో రాజీపడబోం: మోదీ
- Advertisment -

ఆ విషయంలో రాజీపడబోం: మోదీ

- Advertisment -
- Advertisment -

రష్యా నుంచి ముడిచమురు (Crude Oil), ఆయుధాలు (Arms) కొనుగోలు చేస్తుందనే అక్కసుతో అమెరికా అధ్యక్షుడు (American President) డొనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ భారత్‌పై 50 శాతం ప్రతీకార సుంకాలు(Revenge Tariff) విధించిన నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారతీయ రైతుల(Indian Farmers) ప్రయోజనాలను ఫణంగా పెట్టమని అమెరికాకు గట్టిగా బదులిచ్చారు.

వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన ‘ఎం.ఎస్ స్వామినాథన్ సెంటినరీ అంతర్జాతీయ సదస్సు’లో మోదీ ప్రసంగించారు. సదస్సులోనే అమెరికా విధించిన సుంకాలపై మోదీ స్పందించారు. తమకు దేశ రైతుల సంక్షేమమే ముఖ్యమని, రైతులు, మత్య్సకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదని తేల్చిచెప్పారు.

ఈ నిర్ణయం వల్ల తాను వ్యక్తిగతంగా ఎంతో మూల్యం చెల్లించాలని తెలుసు, కానీ, రైతుల కోసం తాను ఆ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. భారత్ కూడా అందుకు సిద్ధంగా ఉందని కుండబద్దలు కొట్టారు. అమెరికా ప్రతీకార సుంకాలకు భయపడే పరిస్థితి లేదన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -