end
=
Friday, August 8, 2025
సినీమామంచి సినిమా.. కానీ !
- Advertisment -

మంచి సినిమా.. కానీ !

- Advertisment -
- Advertisment -

‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ పరాజయాల తరువాత వచ్చిన మహేష్​ ​బాబు బ్లాక్ బస్టర్ మూవీ “శ్రీమంతుడు”. మహేష్ బాబు ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా అనడం కంటే.. ఊపిరి పోసిన సినిమా అనొచ్చు. ఇది సగటు ప్రేక్షకుడికి ప్లేట్ మీల్స్ లాంటి మూవీ. ప్లేట్ మీల్స్ లాంటి సినిమా అని ఎందుకు అన్నానంటే ఇది మంచి కథ. దీనిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవ్వాలి. విందు భోజనం లాంటి సినిమా అవ్వాలి. కానీ ఏదో లోపించిందనిపిస్తుంది. అది ఏంటి అనేది పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నా. దిగ్గజ నటులు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సితార, తులసి వంటి మంచి నటులున్నా సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనేది వాస్తవం. మహేష్​ బాబు సినిమా చేయడం ఇష్టం లేనట్టు నటించాడు. ఇదే కాదు ‘ఆగడు’ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో ఆయన నటన పేలవంగా ఉంది. మునుపటి ఊపు ఉత్సాహం లేవు. ‘1 నేనొక్కడినే’ లాంటి సినిమా చేస్తే తిరస్కరించిన తెలుగు ప్రేక్షకుల మీద, ఫ్యాన్స్ మీద అలిగినట్టు ఉన్నాడు మహేష్ బాబు. మళ్లీ ‘శ్రీమంతుడు’ విషయానికి వస్తే..

“ఊరిని దత్తత తీసుకోవడమంటే…
జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి
వెళ్లి పోతాననుకున్నార్రా !
వీడ్నీ,వాడ్ని,వాడ్ని వాడ్ని వీళ్ళందర్నీ, నిన్నూ మొత్తాన్ని దత్తత తీసుకున్నాను…
రేయ్… ఊరి నుంచి చాలా తీసుకున్నారు
తిరిగిచ్చేయాలి లేదంటే లావైపోతారు..!”

….డైలాగు కొరటాల శివ కలం పవర్ ఏంటో చూపించాయి. చిత్రం కమర్షియల్ గా కాసుల వర్షం కురిపించింది. మంచి కాన్సెప్ట్, ఇంకాస్త ఇంట్రెస్ట్ పెట్టి తీసి ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ మీద పెట్టిన శ్రద్ధ ‘శ్రీమంతుడు’పై పెట్టలేదేమో అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా మంచి సినిమా.. అంతే. మనసులో నిలిచిపోయే సినిమా అయితే మరింత బాగుండేది..!

‌‌_ విశ్వ టాకీస్​

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -