తెలంగాణ రైతులు (TG Farmers) దేశానికి సరిపడా (Enough For) ఆయిల్‌పామ్ (Oil Palm)ను పండించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి (Agri Culture Minister) తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కొనియాడారు. రైతులకు అవకాశం ఇస్తే మరెన్నో విజయాలు సాధించగలరని కితాబునిచ్చారు. ఆయన పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లాలోని ఇంచర్లలో పామాయిల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు వస్తాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ప్రభుత్వం తరఫున నిర్మించిన పెద్ద ఫ్యాక్టరీని ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులకు ప్రోత్సాహకాలు: ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని మంత్రి వివరించారు. పంటను రైతుల వద్దకే వచ్చి తీసుకెళ్తారని, వారం రోజుల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా, పంట ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ పంటకు పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా లాభాలు పొందే రైతులందరికీ కారు కొనేంత ఆర్థిక స్థోమత లభిస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయం వల్ల వచ్చే సంపాదన ఆనందాన్ని ఇస్తుందని, మరే ఇతర వాటిలో ఇది దక్కదని మంత్రి తెలిపారు.
- Advertisment -
దేశానికి సరిపడా ఆయిల్‌పాం తెలంగాణలోనే..
- Advertisment -
- Advertisment -
- Advertisment -
- Advertisment -
- Advertisment -