end
=
Thursday, August 14, 2025
సినీమాఉత్తరాది వారు నన్ను అలానే చూశారు..
- Advertisment -

ఉత్తరాది వారు నన్ను అలానే చూశారు..

- Advertisment -
- Advertisment -

స్టార్ హీరోయిన్(Star Actress) పూజా హెగ్డే ఇటీవల తన కెరీర్​ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారని, దక్షిణాదిలో మాత్రమే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించాయని ఆమె అన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘రాధేశ్యామ్’ సినిమాలో తన నటన చూసి ‘సూర్య రెట్రో’ సినిమాలో రుక్మిణి పాత్ర కోసం తనను తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. వాటిని తాను పట్టించుకోనని, సోషల్ మీడియా అనేది నిజ జీవితానికి భిన్నంగా ఉంటుందని ఆమె అన్నారు. టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుల గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ‘మోనికా’ పాట గురించి మాట్లాడుతూ, ఆ పాట కేవలం వ్యాపార ప్రమోషన్స్ కోసమేనని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ముందుగానే తనకు చెప్పారని పూజా వెల్లడించారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని తాను నమ్మినట్లు, ఇటాలియన్ నటి మోనికా బెలూచీ పేరు ఆకర్షణతోనే ఈ పాటలో నటించానని ఆమె పేర్కొన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక తెరపై ఆమె ఎలా ఆకట్టుకుంటారో చూడాలంటే పంద్రాగస్టు వరకు వేచి చూడాల్సిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -