end
=
Thursday, August 14, 2025
వార్తలురాష్ట్రీయంభూ స‌మ‌స్య‌లు తీర‌క‌పాయె !
- Advertisment -

భూ స‌మ‌స్య‌లు తీర‌క‌పాయె !

- Advertisment -
- Advertisment -

‘ధరణి’ పోర్టల్(Dharani Portal) స్థానంలో ‘భూ భారతి` (Bhu Bharathi) తీసుకొచ్చి రైతుల భూ సమస్యలన్నీ (Land Issues)త్వరితగతిన పరిష్కరిస్తామని దరఖాస్తులు స్వీకరించింది(Taken Applicati. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపు ఒక్క సమస్య కూడా పెండింగ్ లేకుండా చేస్తామని చెప్పింది. గత ప్ర‌భుత్వం ధరణి పోర్టల్‌తో ప‌రిష్కారం చూప‌ని సమస్యలకు సైతం `భూభార‌తి` పరిష్కారం చూపుతుందని బీరాలు ప‌లికి,

ఇప్పుడు ఆ స‌మ‌స్య‌ల గురించే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇప్పుడే కాదు.. క‌నుచూపు మేర‌లో భూస‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో త‌లెత్త‌తున్న సాంకేతిక స‌మ‌స్య‌లే అందుకు కార‌ణం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భూస‌మ‌స్య‌ల కోసం దరఖాస్తు చేసుకుని ఇప్పుడా..? అప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ప్రధాన సమస్యలివీ..
ప్రభుత్వ అవసరాల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమితో పాటు, స‌ద‌రు రైతుల‌కున్న‌ మొత్తం భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాబితా నుంచి తమ భూమిని తొలగించాలని కోరినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే సాదాబైనామాలకు సంబంధించి.. అనేక కేసులు ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉన్నందున, రెవెన్యూశాఖ ఇప్ప‌ట్లో వాటికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం చూపే ప‌రిస్థితి లేదు.

అలాగే భూ పంపిణీలో తేడాలు, సర్వే నంబర్ల మిస్సింగ్, రికార్డుల్లో పేర్లు తారుమారు సమస్యలు పరిష్కరించడం చూడా ఆశాఖ‌కు పెద్ద సమస్యగా మారింది. గ‌త ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో డిజిటలైజ్ చేసిన డాటాను, భూభారతిలో చేర్చడం కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. ఆప‌రేట‌ర్లు క్షేత్ర‌స్థాయిలో సర్వర్ డౌన్‌, నెట్‌వర్క్ లేమి వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ సేవ‌లు నిర్వ‌హించేందుకు క్షేత్ర‌స్థాయిలో శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల కొరత కూడా ఉంది.

ఒక్కో ఆపరేటర్ 100- 200 దరఖాస్తులకు మాత్రమే నోటీసులు జనరేట్ చేయ‌గ‌లుగుతున్నాడు. ఇక వేలాది ద‌రఖాస్తులు ఎప్పుడు ఆన్‌లైన్ చేయాలంటూ.. సిబ్బంది వాపోతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -