శ్రీకృష్ణుడి (The Lord Sri krishna)ది ఇతిహాసా(in the epics)ల్లో గొప్ప పాత్ర.. కురుక్షేత్ర సంగ్రామం (War Of Kuruksethra)లో పార్థుడికి గీతోపదేశం చేసి శత్రుసంహారం (Enemy extermination) చేసిన తత్వవేత్త (Philosopher)ఆతడు.. జగన్నాటక సూత్రధారి అని ఆయనకు పేరు.. అలాంటి ధీరోదాత్తుడు (Brave man) తెరపై కనిపించి.. కరవాలము(Sword)
చేతబూని రణరంగం(Come In To The War)లోకి దిగితే? ఎలా ఉంటుంది.. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ! ఔను, శ్రీకృష్ణున్ని యుద్ధవీరుడిగా వెండితెరపై చూపించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించాయి అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ఈ సంస్థలు సంయుక్తంగా వెండితెరపైకి తీసుకొస్తున్నాయి. మేకర్స్ తాజాగా ‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’ పేరుతో సినిమా నిర్మిస్తున్నట్లు కూడా ప్రకటించారు.
ముకుంద్ పాండే కథ, స్క్రీన్‌ప్లే ఇస్తూ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 11-12వ శతాబ్దం నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెరపై చూపించబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇదని వెల్లడించారు. ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో
తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ బోధకుడు ‘జితామిత్ర ప్రభుశ్రీ’ ఆశీస్సులతో ఈ సరికొత్త దృశ్యకావ్యం రూపొందుతోందని మూవీ టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.