భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాల ప్రారంభ పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, తనికెళ్ల భరణి, సీ కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు,
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, కేఎల్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ ఆన్, గౌరవ దర్శకత్వం చేయించారు. ఈ చిత్రాలను 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభమైన చిత్రాలు, వాటి దర్శకుల వివరాలు: ‘జస్టిస్ ధర్మ’ (యండమూరి వీరేంద్రనాథ్),
‘నాగపంచమి’ (ఓం సాయిప్రకాశ్), ‘నా పేరు పవన్‌కల్యాణ్’ (జేకే భారవి), ‘టాపర్’ (ఉదయ్ భాస్కర్), ‘కేపీహెచ్‌బీ కాలనీ’ (తల్లాడ సాయికృష్ణ), ‘పోలీస్ సింహం’ (సంగకుమార్), ‘అవంతిక-2’ (శ్రీరాజ్ బళ్లా), ‘యండమూరి కథలు’ (రవి బసర), ‘బీసీ కమాండో’ (మోహన్ కాంత్), ‘హనీ కిడ్స్’ (హర్ష), ‘సావాసం’ (ఏకరి సత్యనారాయణ), ‘డార్క్ స్టోరీస్’ (కృష్ణ కార్తీక్), ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ (బీశ్రీ నివాసరావు), ‘ది ఫైనల్ కాల్’ (ప్రణయ్ రాజ్ వంగరి), ‘అవతారం’ (డాక్టర్ సతీశ్).