end
=
Tuesday, August 19, 2025
సినీమానేషనల్​ అవార్డ్​ విన్నర్స్​కు అభినందన
- Advertisment -

నేషనల్​ అవార్డ్​ విన్నర్స్​కు అభినందన

- Advertisment -
- Advertisment -

71వ జాతీయ సినీ పురస్కారాల (National Award Winners)లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖుల (Cinema Actors and Technicians)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం సన్మానించి, వారికి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారిని ఆహ్వానించి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,

తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood Industry) సాధిస్తున్న విజయాలు గర్వకారణమ (Proud To the TG State)ని అన్నారు. జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించడం ద్వారా తెలుగు సినిమా కీర్తిని మరింత ఇనుమడింపజేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉన్నతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి,

‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్స్ వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ ఉన్నారు. అలాగే, ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ కూడా సీఎం చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి,

హైదరాబాద్‌ను భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -