end
=
Wednesday, August 20, 2025
వార్తలురాష్ట్రీయంయూరియా కోసం ప‌డిగాపులు
- Advertisment -

యూరియా కోసం ప‌డిగాపులు

- Advertisment -
- Advertisment -

ఉమ్మడి వరంగల్ జిల్లా(United Warangal Dist)లో రైతులు(Farmers) యూరియా కొరత(Scarcity of Uria)తో తీవ్ర ఇబ్బందులు(Facing Problems) పడుతున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా(Mahaboobabad Dist)లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది (situation is alarming). నాట్లు ప‌డి నెల రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా వేయలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్తా యూరియా దొరికితే అదే మహాభాగ్యం (great blessing)గా భావిస్తూ నానా అగచాట్లు పడుతున్నారు. మంగళవారం కేసముద్రం మండలం ఉప్పరపల్లి రైతువేదిక వద్ద యూరియా బస్తాల కోసం వందల మంది క్యూ కట్టారు. వ‌ర్షాన్ని కూడా లెక్క చేయ‌కుండా ప‌డిగాపులు కాశారు. కొంద‌రు రైతులు త‌మ కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి రైతు వేదిక వద్ద బారులు తీరారు.

కుటుంబంలోని నలుగురు నిలబడితే ఒక్కొక్కరికీ రెండేసి బస్తాలు దొరక్కపోతాయేమోన‌ని క్యూలో నించుకున్నారు. కొంద‌రు త‌ల్లులైతే చంటిబిడ్డ‌ల‌ను ఎత్తుకుని వ‌చ్చి క్యూలైన్ల‌లో నిల‌బ‌డ్డారు. అలాగే కేసముద్రం సొసైటీ, కల్వల తదితర గ్రామాల్లో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నర్సింహుల పేట మండల కేంద్రంలో యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -