కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (Kaleswaram Lift Irrigation Project) కుంగుబాటు, ప్రాజెక్ట్ పరిధిలో జరిగిన అవకతవకలపై (Irregularities that occurred) ఇటీవల జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ నివేదిక (Commission Report)ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ (Ex Cm KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Ex Minister Harish Rao)
హైకోర్టులో పిటిషన్ (Petition at High Court) దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హత లేదని, కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతేడాది మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్‌గా జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నియమించింది.
దాదాపు 16 నెలలు ఘోష్ కమిషన్.. నాటి ముఖ్యమంత్రి, అప్పటి సాగునీటి, ఆర్థిక మంత్రులు.. ఐఏఎస్, ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజాసంఘాలు, పాత్రికేయులు, ముందుకొచ్చిన ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించింది. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటలను ప్రశ్నించి… వారి వివరణను విశ్లేషించింది. గత నెల 31వ తేదీన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.