end
=
Wednesday, August 20, 2025
వార్తలుజాతీయంఉప రాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
- Advertisment -

ఉప రాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

- Advertisment -
- Advertisment -

ఉప రాష్ట్రపతి ఎన్నిక(Vice President Elections)లో తెలంగాణ బిడ్డ (Telangana`s Pride) జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి (Justice Sudersan Reddy) బరిలో నిలువనున్నారు. ఇండియా కూటమి(India Block) అభ్యర్థి(Contistent)గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి (Ex Supreme Court Justice) జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డిని ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్​ సుందర్శన్​రెడ్డికి అరుదైన అవకాశం (Rare opportunity) వచ్చింది.

ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా మంగళవారం ప్రకటించారు. విపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆయన పేరుకు మద్దతు తెలిపాయని తేల్చిచెప్పారు. ఇక ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌, విపక్షాల అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మధ్య ఇప్పుడు పోటీ అనివార్యమైంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్వస్థలం. 1946లో జన్మించిన సుదర్శన్‌రెడ్డి..

1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, గువాహటి హైకోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించారు. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా కీలక తీర్పులిచ్చారు. న్యాయకోవిదుడిగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందనే విశ్వాసంతోనే ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

మరోవైపు, ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలను కోరింది. ఇందులో భాగంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు కాల్​ కూడా చేశారు. అయితే, విపక్షాలు సొంతంగా తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఈ ఎన్నికలో పోటీ తప్పదని స్పష్టమైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -