తెలంగాణ (Telagnana State)లో స్థానిక సంస్థల ఎన్నికల (Local Elections)కు సంబంధించి బీసీ రిజర్వేషన్ల (BC Quota)పై నెలకొన్న సందిగ్ధత త్వరలో వీడనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలా? లేక కోర్టు ఇచ్చిన గడువు(Court Order)ను పొడిగించమని కోరాలా? అనే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) ఈనెల 23న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud)
రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) (Political Affairs Committee) సమావేశంలో చర్చించి ఓ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఉన్నారు. కోర్టులో ఈ అంశాన్ని సమర్థంగా వాదించాలంటే ఒక బలమైన విధాన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. లేదంటే మరింత మంది న్యాయ నిపుణులను కలిసి,
వారి సలహాలు తీసుకోవాలా? అన్న మీమాంసలో సీఎం, పీసీసీ చీఫ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారింది. సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై విస్తృత చర్చ జరిపి, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని, కోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై ఓ నిర్ణయానికి రానున్నారు. గతంలో ఉన్న 34 శాతం కాకుండా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ సంకల్పం.
ఈ అంశంపై కోర్టులో ఒక బలమైన వాదనను వినిపించి, న్యాయపరంగా కూడా నిలబడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం అనంతరం స్థానిక ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా.. జూన్ 25న హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు పదవీ కాలం పూర్తయి ఏడాది దాటినా ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించడతోనే హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.