జీఎస్టీలో 12% స్లాబ్ (GST Slab)ను రద్దు చేసి, పేదలకు మేలు చేస్తున్నట్లు కేంద్రం చేస్తున్న ప్రచారాన్ని(Central GOVT Fake News) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ప్రజలను మభ్యపెట్టే మరో “జుమ్లా” అని పేర్కొంటూ, మొత్తం జీఎస్టీ ఆదాయంలో కేవలం 5% వాటా ఉన్న నామమాత్రపు స్లాబ్‌ను రద్దు (Dismiss The Slab)చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.
నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపిందని ఆరోపించారు. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే స్లాబ్ రద్దు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోయినా, దేశంలో పెట్రో ధరలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయని ఎత్తిచూపారు.
చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
శాంతి భద్రతలపై నిమ్మకు నీరెత్తినట్లుగా
నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా సర్కారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పట్టపగలే ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారని, కూకట్‌పల్లి పరిధిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురి అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు.
పోలీసులను రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఉపయోగించడం, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపకపోవడం వల్లే రాష్ర్టంలో ఈ పరిస్థితులు దాపురించాయని అన్నారు.