హైదరాబాద్ శివార్ల (Near By Hyderabad)లోని చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని ‘ఎక్స్పీరియమ్ ఎకో పార్క్’ (Experium Eco Park) పర్యాటకులను ఆకర్షిస్తున్నది (Attracting the Tourists). ప్రకృతిని ఆస్వాదిస్తూ, కాసేపు ఆ లోగిలిలో సేద తీరాలనుకునే వారికి ఈ ప్రదేశం చక్కటి డెస్టినేషన్ (Super Destination)గా మారింది. ఇది కేవలం ఒక పార్క్ మాత్రమే కాదు,
వందకి వందశాతం ప్యూర్ ఆక్సిజన్ అందించే సహజ సిద్ధమైన మొక్కలు ఉన్న వనం(Healthy Park) అని చెప్పవచ్చు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్లో ప్రపంచంలోని 85 దేశాల నుంచి సేకరించిన 25,000 మొక్కల జాతులు ఎదుగుతున్నాయి. ఈ ప్రదేశం అరుదైన చెట్లతో అలరారుతోంది. ఆ మొక్కల్లోఅరుదైనవి, అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి. జపనీస్ గార్డెన్స్, ఫ్లోరల్ జోన్స్ 3,000 సంవత్సరాల పురాతనమైన ‘విష్ ట్రీ’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నిర్మించిన మానవ నిర్మిత బీచ్ మరో ప్రత్యేక ఆకర్షణ. నగరంలో ఒక బీచ్ అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
సాహసవంతులకు క్రేజీ ప్లేస్..
సాహసాలు ఇష్టపడే వారికీ ఈ పార్క్ చక్కటి డెస్టినేషన్. పార్క్లో ఒక కిలోమీటరు పొడవైన, నాలుగు దిశల్లో సాగే జిప్‌లైన్ ఉంటుంది. చూడటానికి ఈ సాహసం ఒళ్లు గగొర్పొడిచేటట్లు ఉంటుంది.
కానీ, పూర్తిగా సేఫ్ సుమా. అలాగే స్నో పార్క్, బాక్స్ క్రికెట్ క్రీడలు ఆడవచ్చు. పార్క్ లో అనేక అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా, 30 అడుగుల ఎత్తు ఉన్న 20 స్టెయిన్‌లెస్ స్టీల్ శిల్పాలు, అనేక లైవ్ ట్రీ శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. పార్క్ లో 600కు పైగా ‘సెల్ఫీ స్పాట్స్’ ఉన్నాయి. పెళ్లికి ముందు, తర్వాత, ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లు, బర్త్‌డే పార్టీలకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
భారతదేశంలోనే అతిపెద్ద హంపీ థియేటర్ ఇక్కడ ఉంది. థియేటర్లో ఒకేసారి 1,500 మంది ఆశీనులు కావొచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలకు వేదికగా అది నిలుస్తున్నది. పర్యాటకుల కోసం ఇక్కడ 40 గదులు, 20 కాటేజ్‌లతో కూడిన ఒక సహజ రిసార్ట్ ఉంది. అంతేకాకుండా, ఇక్కడ మిచెలిన్-గ్రేడ్ చెఫ్ రెస్టారెంట్లు, భారతదేశంలో అతిపెద్ద పబ్, అక్వేరియం రెస్టారెంట్ కూడా ఉన్నాయి. పార్క్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ, ఇప్పటికే పర్యాటక కేంద్రంగా మారడం విశేషం.
సందర్శించు సమయం: ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు.
ప్రవేశ రుసుము: సాధారణం రోజుల్లో కంటే వీకెండ్స్ ధరలు ఎక్కువగా ఉంటాయి. ధరలు సీజన్‌ను బట్టి తరచూ మారుతుంటాయి. సందర్శకులు అధికారిక వెబ్‌సైట్ లేదా బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫామ్స్ చూసి ప్రవేశ రుసుముకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.