end
=
Monday, October 13, 2025
రాజకీయంచంద్రబాబుకు మరో చారిత్రక ఘనత..15 ఏళ్ల సీఎం పదవీకాలం పూర్తి చేసిన తొలి తెలుగు నేత
- Advertisment -

చంద్రబాబుకు మరో చారిత్రక ఘనత..15 ఏళ్ల సీఎం పదవీకాలం పూర్తి చేసిన తొలి తెలుగు నేత

- Advertisment -
- Advertisment -

CM Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో అపూర్వ మైలురాయిని అధిగమించారు. అక్టోబర్ 10నాటికి ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పూర్తి చేసిన చంద్రబాబు(Chandrababu), ఈ ఘనత సాధించిన తక్కువగణంకే చెందిన దక్షిణాది నేతలలో మూడో వ్యక్తిగా నిలిచారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంజర్ కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి తర్వాత ఈ అరుదైన రికార్డును అందుకున్న నాయకుడిగా చరిత్రలో నిలిచారు. ఏవిధమైన రాజకీయ వారసత్వం(Political succession) లేకుండా సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర నాయకుడిగా ఎదగడం చంద్రబాబును ప్రత్యేకంగా నిలబెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 8 సంవత్సరాల 255 రోజులు, నవ్యాంధ్రప్రదేశ్‌కు మరో 6 సంవత్సరాల 110 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన, మొత్తం 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి నాయకత్వం వహించారు. ఈ సమయంలో ఆయన మూడుసార్లు సీఎం బాధ్యతలు చేపట్టారు. 1995, 2014, 2024.

చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అనేక సంధులకు, విఘ్నాలకు నిదర్శనం. 1995లో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని అధిగమించి, అప్పటి సీఎం ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేసి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రారంభం నుంచే ఆయన పాలనలో ప్రగతికి ప్రాధాన్యత ఇచ్చారు. హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేయడం, హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, ఇంజినీరింగ్ విద్య అభివృద్ధికి చేసిన కృషి ఇవన్నీ తెలుగురాష్ట్రాల రూపురేఖలను మార్చేశాయి. తన పాలనలో తీసుకొన్న కీలక నిర్ణయాలు మొదట్లో విమర్శలకు గురైనా, కాలక్రమేణా అందుకు అర్హమైన గుర్తింపుని సాధించాయి. చంద్రబాబు దీర్ఘదృష్టి, అభివృద్ధిపట్ల కమిట్‌మెంట్‌కు ఇది ప్రతీక. 2004లో ఓటమి అనంతరం దశాబ్దకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ పార్టీని గట్టిగా నిలబెట్టారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, రాజధాని నిర్మాణం, వ్యవస్థాపక పనులపై దృష్టి పెట్టారు.

అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజకీయ జీవితం కష్టకాలంలోకి ప్రవేశించింది. అరెస్ట్, దాడులు, పార్టీపై ఒత్తిడి వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా వాటిని అధిగమించి, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి ఘనవిజయం సాధించి మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. తిరుపతి సమీపంలోని నారావారిపల్లె(Naravaripalle) అనే చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీకాలం ద్వారా భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈకే నయనార్ వంటి దిగ్గజాలను అధిగమించిన చంద్రబాబు, అభివృద్ధి దిశగా ప్రజలలో దీర్ఘకాలిక విశ్వాసం కలిగించిన నాయకుడిగా నిలిచారు. రాష్ట్రానికి పరిపక్వతతో కూడిన నాయకత్వాన్ని అందిస్తూ, చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలానికి పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనతను తన పేరుతో నమోదు చేసుకున్నారు. రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు ప్రయాణం విజన్‌తో కూడిన నాయకత్వానికి జీవచ్ఛక్తి ఎలా అవుతుందో తెలిపే ఉదాహరణ.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -