end
=
Monday, October 13, 2025
వార్తలురాష్ట్రీయంపుస్తకాలు మానసిక పరిపక్వతకు మార్గం : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- Advertisment -

పుస్తకాలు మానసిక పరిపక్వతకు మార్గం : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

- Advertisment -
- Advertisment -

Vijayawada: పుస్తకాలు చదవడం ద్వారా మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల(Books) ప్రభావం ఎంతో గాఢంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి(Lakshmi Murdeshwar Puri) రచించిన “ఆమె సూర్యుడిని కబళించింది” అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఒక మంచి పుస్తకం మన ఆలోచనా ధోరణిని మార్చగలదు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల, దీక్ష అవసరం. ఈ పుస్తకంలోని మాలతి అనే పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆమెలో కనిపించే ధైర్యం, విజ్ఞానం, భారతీయ సాంప్రదాయాల పట్ల గౌరవం చూస్తే ప్రతి పాఠకుడు ప్రభావితమవాల్సిందే అని అన్నారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్ కల్యాణ్ నా తల్లి వంటగదిలో నుంచే ప్రపంచాన్ని చూశారు. అదే విధంగా నేను కూడా జీవితాన్ని చూస్తూ, ఆలోచించే విధానాన్ని పుస్తకాల ద్వారానే అభివృద్ధి చేసుకున్నాను. ఏ విషయాన్ని అయినా సమతుల్యంగా చూడటమే నిజమైన పరిణతి అని చెప్పారు. భారతీయ ఆలోచనా ధోరణి పట్ల ఆయనకు గాఢమైన అనుబంధం ఉందని పేర్కొంటూ భారతీయ సంస్కృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది. ఈ కారణంగా జనసేన మహిళా విభాగానికి ‘ఝాన్సీ వీర మహిళ’ అనే పేరు పెట్టాము. మహిళల ప్రగతికి అనుకూలంగా, రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు త్వరలో అమలులోకి తీసుకురాబోతున్నాము అని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నా అభిమాన నాయకుడు. నేను ఈ రోజు మంత్రిగా కాకుండా సాధారణ వ్యక్తిగా ఉన్నా, ఆయనను చూసి ఆనందంతో ‘పవర్ స్టార్’, ‘ఓజీ’ అంటూ అరుస్తాను అని పేర్కొన్నారు. సభ మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. పవన్ కల్యాణ్ ప్రసంగం పుస్తక పఠనానికి ప్రాధాన్యతను మరోసారి నొక్కిచెప్పింది. పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మలుపు తిప్పగలవని, సమాజానికి మనం అందించే సేవలలో పుస్తకాల పాత్ర అమోఘమని స్పష్టమైంది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -