end
=
Tuesday, December 2, 2025
వార్తలురాష్ట్రీయంప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయండి..పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన
- Advertisment -

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయండి..పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన

- Advertisment -
- Advertisment -

CM Chandrababu: ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) త్వరలో శ్రీశైలం, కర్నూలు (Srisailam, Kurnool) ప్రాంతాల్లో పర్యటన చేయనున్న సందర్భంగా ఆ పర్యటనను ఘనవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి కావాలి. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్‌ను ప్రభావితం చేసే అంశం అని చంద్రబాబు స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలు రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారంతో రాష్ట్రానికి అభివృద్ధి గణనీయంగా వేగం పడుతోంది అని తెలిపారు.

గూగుల్‌ సంస్థతో ఇటీవల 15 బిలియన్ డాలర్ల విలువైన డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ (FDI) ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన మంత్రి నారా లోకేశ్‌ను చంద్రబాబు ప్రశంసించారు. గూగుల్‌ ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు ప్రధాని, కేంద్ర మంత్రుల చొరవతోనే ఇది సాధ్యమైంది. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలిచింది అని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను గుర్తు చేసిన చంద్రబాబు, గత పాలకుల తప్పిదాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని విమర్శించారు. వారు తీరని విధ్వంసం చేసి వెళ్ళారు. వాటిని సరిచేయడానికే మాకు చాలా సమయం పట్టింది. అయినా సరే, ‘యోగాంధ్ర’, ‘అమరావతి రీస్టార్ట్’ వంటి ప్రాజెక్టుల ద్వారా మేము తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం అని తెలిపారు.

ప్రధాని మోదీ పాల్గొననున్న ‘‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వెల్లడిస్తూ రాయలసీమలో పరిశ్రమలను భారీగా ఏర్పాటు చేస్తున్నాం. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోస్తున్నాం. తిరుపతి, శ్రీసైలం, గండికోట వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధించాలన్నది మన లక్ష్యం. అందుకోసం ప్రతి ఒక్కరు తమ బాధ్యతను గుర్తించి పనిచేయాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ప్రజలలో విశ్వాసాన్ని పెంచేలా, అభివృద్ధి పట్ల నమ్మకాన్ని కలిగించేలా కృషి చేయాలని సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -