PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు (Indian women cricket team) తొలి వన్డే ప్రపంచ కప్ (World Cup)విజయం సాధించిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జట్టును కలిశారు. ప్రతి ప్లేయర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన, వారి ప్రతిభకు ప్రశంసలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతి హర్మన్ జేబులోకి వెళ్లిన సందర్భాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. అదృష్టవశాత్తూ బంతి తన దగ్గరకు వచ్చినదని హర్మన్ తెలిపారు. ప్రధాని మోదీ హర్లీన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్‌పై చేసిన అద్భుత క్యాచ్‌ను కూడా గుర్తు చేశారు. ఆ సంభాషణ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేశారు. ఈ సమావేశంలో హర్లీన్ డియోల్ ఒక సరదా ప్రశ్న అడిగి అందరినీ నవ్వించారు. మైక్ అందుకున్న డియోల్, నవ్వుతూ సర్, మీ స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మీ స్కిన్‌కేర్ వెనుక రహస్యమేంటో చెప్పగలరా? అని అడిగింది.
ఆశించని ఈ ప్రశ్నను అందరూ హనుమంతుగా నవ్వుతూ స్వీకరించారు. ప్రధాని మోదీ చిరునవ్వుతో “నేను వాటి గురించి ఎక్కువ ఆలోచించను అని సమాధానం ఇచ్చారు. తర్వాత జట్టు సభ్యుల్లో ఒకరు సర్, ఇది దేశంలోని కోట్లాది మంది అభిమానుల ప్రేమ వల్లే అని చెప్పడంతో, అందరూ మరోసారి నవ్వు పడ్డారు. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ సరదాగా స్పందిస్తూ చూశారా సర్, ఇలాంటివారిని నేను డీల్ చేయాల్సి వచ్చింది. అందుకే, నా జట్టు త్వరగా తెల్లబడిపోయింది అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈరోజు జట్టు కలవనుంది. అంతేకాక, ప్రధాని మోదీ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ప్రశ్నిస్తూ ఆమె హనుమాన్ టాటూ గురించి అడిగారు. దీప్తి నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం. ఇది వ్యక్తిగతంగా నాకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రసంగాలనూ తరచుగా వింటూ, క్లిష్ట పరిస్థితులలో ప్రశాంతంగా వ్యవహరించడం నేర్చుకున్నాను అని సమాధానం ఇచ్చింది.
ఆసీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ తీవ్ర భావోద్వేగానికి గురైందని ప్రధాని గుర్తు చేసారు. జెమీమా ముందు కొన్ని సందర్భాల్లో ఆసీస్‌పై గెలవడానికి చాలా దగ్గరగా వచ్చి ఓటమి చెందాము.సెమీఫైనల్‌లో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు నా లక్ష్యం చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం. హర్మన్‌తో కలిసి బాగా భాగస్వామ్యం సృష్టించగలిగాము. మనం వరుసగా ఓడినా, కలిసికట్టుగా పుంజుకున్నాం. ముఖ్యంగా కిందపడ్డపుడు తిరిగి పైకి లేవడమే మా విజయం అని వివరించారు. ప్రధాని మోదీతో జరగిన ఈ ప్రత్యేక సమావేశం భారత మహిళా జట్టు ప్రతిభ, ఆత్మవిశ్వాసం మరియు జట్టు భావాన్ని మరోసారి ప్రదర్శించింది.
