end
=
Thursday, January 1, 2026
వార్తలుజాతీయంఢిల్లీ బాంబు పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల
- Advertisment -

ఢిల్లీ బాంబు పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల

- Advertisment -
- Advertisment -

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort) సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు(Car bomb explosion) కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్‌ ఫోటో(Dr. Umar Mohammed Photo)ను అధికారులు తొలిసారిగా మీడియాకు విడుదల చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన ఈ భయానక పేలుడులో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో అకస్మాత్తుగా విపరీతమైన శబ్ధంతో పేలుడు సంభవించింది. కారు పూర్తిగా ధ్వంసమై ముక్కలైపోయింది. పేలుడు సమయంలో ఆ వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అదృష్టవశాత్తు, సోమవారం ఎర్రకోట పర్యాటకులకు మూసివేసి ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగకుండా తప్పిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రారంభ దర్యాప్తులో ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. గాయపడిన వారి శరీరాలపై పేలుళ్లలో సాధారణంగా కనిపించే ఇనుపముక్కలు లేదా గాట్లు లేకపోవడం విచారణ అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. “ఇది సాధారణ పేలుడు కాదు. ఉపయోగించిన పదార్థం అధిక శక్తివంతమైనదిగా అనిపిస్తోంది,” అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రాథమికంగా అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాల మిశ్రమం ఉపయోగించబడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పేలుడు ఘటనకు కొద్ది గంటల ముందే హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ కశ్మీరీ వైద్యుడు అద్దెకు ఉంటున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సోదాలో సుమారు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్‌, పిస్టల్స్‌, మందుగుండు సామగ్రి లభించాయి. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ పోలీసుల సంయుక్త బృందం నిర్వహించింది. మరోవైపు, పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్‌ కుటుంబ సభ్యులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఉమర్‌ పేలుడులో మృతి చెందాడా? లేక ఇంకా పరారీలో ఉన్నాడా? అన్న అంశంపై స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. దాడి వెనుక ఉగ్రవాద నెట్‌వర్క్ ఉన్న అవకాశం ఉందని భావించి, దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నాలు వేగవంతం చేశాయి. అధికారులు ఈ ఘటనను జాతీయ భద్రతా పరంగా అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -