end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంమీ-సేవ ఇప్పుడు వాట్సప్‌లో!
- Advertisment -

మీ-సేవ ఇప్పుడు వాట్సప్‌లో!

- Advertisment -
- Advertisment -

మీ-సేవ పూర్తిగా WhatsApp ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఇకపై పౌరులు ఎలాంటి ప్రభుత్వ సర్టిఫికేట్ అయినా నేరుగా తమ వాట్సప్ ఫోన్ నెంబర్ నుంచే పొందే వీలుంటుంది.

ప్రజలకు ప్రయోజనాలు..

మీ-సేవ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడు లేదు, డాక్యుమెంట్లు నేరుగా వాట్సప్‌లోనే…రియల్ టైమ్ స్టేటస్ ట్రాకింగ్, ఫిర్యాదులు/సపోర్ట్ కూడా అదే నంబర్‌ ద్వారా ఉంటాయి. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సప్ నెంబర్ 80969 58096 ఈ నంబర్‌కి “Hi” పంపగానే MeeSeva మెనూ ఓపెన్ అవుతుంది. తరువాత ఏ సర్టిఫికెట్ కావాలో అడుగుతుంది. ప్రస్తుతం ఆదాయ సర్టిఫికేట్, కుల ధృవీకరణ ,నివాస ధృవీకరణ, జనన–మరణ రిజిస్ట్రేషన్, భూమి ఫిర్యాదులు, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు అన్నీ నేరుగా పొందవచ్చు.

మీ-సేవ WhatsApp లో ఫీజులు ఎలా చెల్లించాలి?

WhatsApp ద్వారా మీ-సేవలో ఏ సర్టిఫికేట్‌కి దరఖాస్తు చేసినా, ఫీజ్ చెల్లింపు డిజిటల్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెస్ ఇలా ఉంటుంది:

మీ-సేవ WhatsApp నెంబర్‌కి +91 80969 58096 “Hi” పంపండి.

1️.“Hi” పంపండి – సర్వీసుల మెనూ ఓపెన్ అవుతుంది

2️. కావలసిన సర్టిఫికేట్/సర్వీస్ ఎంచుకోండి వ్యక్తి గత వివరాలు కొన్ని నింపాలి.

ఉదాహరణకు:
Income Certificate
Caste Certificate
Residence Certificate
Birth/Death Certificate
Land Services etc.

3️. మీ వివరాలు పంపండి
సర్వీస్‌కి అవసరమైన వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్లు WhatsApp లోనే అప్‌లోడ్ చేయాలి. ఉదాహరణకు ఆధార్, ఇంటి పన్ను రసీదు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డుతో పాటు ఆ సర్టిఫికెట్ కొన్ని డాక్యుమెంట్ వివరాలు పిడిఎఫ్ ఫార్మేట్ లో ఇవ్వాలి.

4️. ఫీసు మొత్తం చూపిస్తుంది
సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ సర్టిఫికేట్‌కు సంబంధించిన ఫీజు సాధారణంగా చూపిస్తుంది.*

5️. చెల్లింపు కోసం Payment Link వస్తుంది
WhatsApp లోనే ఒక భద్రమైన Payment Gateway Link వస్తుంది. మీరు నేరుగా మీకు ఉన్న బ్యాంకు సౌకర్యం పట్టి చెల్లించండి.*
UPI (PhonePe / Google Pay / PayTM / BHIM), Net Banking, Debit/Credit Card ద్వారా పేమెంట్ చేయవచ్చు.

6️. చెల్లింపు పూర్తయిన వెంటనే Receipt వస్తుంది. అదే WhatsApp చాట్‌లో మీకు ఫీజు రసీదు వెంటనే వస్తుంది.

7️. సర్టిఫికేట్ రెడీ అయిన తర్వాత WhatsApp లోనే meku అందుతుంది. PDF రూపంలో కలర్ లో డౌన్‌లోడ్ చేయగలిగేలా పంపబడుతుంది. అది మీరు జిరాక్స్ సెంటర్ కి వెళ్లి పొందవచ్చు. ప్రభుత్వం ప్రతిపాదించిన రుసుము మాత్రమే చెల్లించాలి, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -