end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంసత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది: ప్రధాని మోదీ
- Advertisment -

సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది: ప్రధాని మోదీ

- Advertisment -
- Advertisment -

Puttaparthi : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో (Sri Sathya Sai Centenary Celebrations)పాల్గొనడం తనకు గొప్ప అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహోత్సవ సభలో మాట్లాడిన ఆయన, సత్యసాయి బాబా జీవితం, బోధనలు, మానవ సేవా పరంపరపై విశేషంగా ప్రసంగించారు. సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన చూపించిన ప్రేమ, కరుణ, సమానత్వ మార్గం నేటికీ కోట్లాది భక్తులను నడిపిస్తోంది. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అని అన్నారు. బాబా బోధనలు దేశమంతా, ప్రపంచవ్యాప్తంగా మానవసేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

‘అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి’ అనే బాబా సందేశం అనేక మందిని సమాజ సేవ వైపు మలిచింది. లక్షలాది మంది యువతను, సేవా సంస్థలను ఆయన సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి. తాగునీటి ప్రాజెక్టులు, ఉచిత వైద్యసేవలు, నాణ్యమైన విద్య ఇవన్నీ బాబా మానవతా దర్శనానికి ప్రతిరూపాలు అని ప్రధాని చెప్పారు. పుట్టపర్తి పవిత్రతను ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ ఈ భూమిలో ఏదో అనిర్వచనీయమైన శక్తి ఉంది. ఇక్కడ అడుగుపెట్టినప్పుడల్లా ఆధ్యాత్మికత, సేవాస్ఫూర్తి కలగలసిన వాతావరణం మనసును ప్రభావితం చేస్తుంది. సత్యసాయి సంస్థలు కూడా ఇదే ధ్యేయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశిస్తున్నాను అని ఆకాంక్షించారు.

ఈ మహోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ, సత్యసాయి బాబా జీవితం, సేవలు, సందేశాలకు గుర్తుగా రూపొందించిన ₹100 జ్ఞాపక నాణెం మరియు నాలుగు ప్రత్యేక తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. బాబా ఆధ్యాత్మిక ప్రయాణం, సేవా యజ్ఞం, ఆయన ఆశ్రమాల అభివృద్ధి ఇవన్నీ ఈ ప్రత్యేక సంచికలలో ప్రతిబింబింపజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సత్యసాయి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వేలాది మంది భక్తులు, సేవాదారులు, దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులతో పుట్టపర్తి ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది. ఉత్సవ ప్రాంగణమంతా సత్యసాయి బోధనలను ప్రతిబింబించే ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సేవా చాటువలు నిర్వహించగా, ప్రధానోత్సవ సందర్బంగా ఆధ్యాత్మిక స్ఫూర్తి నిండిన వాతావరణం నెలకొంది. బాబా చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -