end
=
Tuesday, December 2, 2025
వార్తలుఅంతర్జాతీయంఇమ్రాన్‌ ఖాన్‌ మృతి వార్తలు.. రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత..సెక్షన్ 144 విధింపు..
- Advertisment -

ఇమ్రాన్‌ ఖాన్‌ మృతి వార్తలు.. రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత..సెక్షన్ 144 విధింపు..

- Advertisment -
- Advertisment -

Pakistan : పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Pakistan Ex PM Imran Khan) మరణించారన్న వార్తలు సోషల్‌మీడియాలో గుప్పుమన్న నేపథ్యంలో, ఆ వదంతులను పాక్‌ ప్రభుత్వం(Pakistan Govt)ఘాటుగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్‌ను కుటుంబసభ్యులు కలవడానికి అధికారులు అనుమతించకపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం వెలువడకపోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) కార్యకర్తలు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు ప్రారంభించారు. మంగళవారం దేశంలోని పలు పట్టణాల్లో ఇమ్రాన్‌కు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించేందుకు టీఐఈ నాయకులు సిద్ధమైనప్పటికీ, వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం రావల్పిండిలో సెక్షన్‌–144 అమలు చేసింది. బుధవారం వరకు ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల కొన్ని గుంపులు రావల్పిండిలో శాంతిభద్రతలను భంగం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ (DIC) హెచ్చరించడంతో ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ రాజకీయ వేడిలో ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారులు ఖాసీం, సులేమాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రి విషయంలో ఏదో ‘‘జరగకూడని విషయం’’ జరిగిందనే అనుమానం కలుగుతోందని వారు తెలిపారు. కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ, జైలు అధికారులు తమను ఇమ్రాన్‌ను కలవనివ్వకపోవడమే కాకుండా, ఆయన ఆరోగ్య స్థితి గురించి ఎటువంటి సమాచారం అందించకపోవడం తమను మానసికంగా వేధిస్తోందన్నారు. గత ఆరు వారాలుగా ఇమ్రాన్‌ను ‘డెత్‌ సెల్‌’లో ఒంటరిగా నిర్బంధించారన్న వార్తలు మరింత భయాందోళనలకు దారితీస్తున్నాయని వారు పేర్కొన్నారు.

2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి అకస్మాత్తుగా సోషల్‌మీడియాలో ఘోరమైన వదంతులు చెలరేగాయి. బలూచిస్థాన్‌ రెబల్స్‌కు చెందిన ఓ ‘ఎక్స్‌’ ఖాతా ఆయనను పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌, ఐఎస్‌ఐ కలిసి హతమార్చినట్లు ఆరోపిస్తూ పోస్ట్‌ చేసింది. ఈ పోస్టులను అనుసరించి, మరికొన్ని మీడియా సంస్థలు కూడా సంబంధిత కథనాలను ప్రచురించారని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో ఇమ్రాన్‌ కుటుంబసభ్యులు ఇటీవల జైలుకు వెళ్లి ఆయనను కలవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడమే కాకుండా విచక్షణారహితంగా దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనలతో టీఐఈ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, కుటుంబసభ్యులకు వెంటనే భేటీ అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాక్‌ రాజకీయ వాతావరణం మరోసారి అస్తవ్యస్తంగా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -