end
=
Friday, December 12, 2025
వార్తలురాష్ట్రీయంనేడు 'తెలంగాణ రైజింగ్​' గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం..
- Advertisment -

నేడు ‘తెలంగాణ రైజింగ్​’ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం..

- Advertisment -
- Advertisment -

Telangana : హైదరాబాద్‌(Hyderabad)లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ప్రధాన లక్ష్యం తెలంగాణలో పెట్టుబడుల(Investments)ను మరింతగా ఆకర్షించడం, పరిశ్రమలను విస్త‌రించడం, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం. ప్రపంచంలోని 44 దేశాల నుంచి దాదాపు 154 మంది ముఖ్య అతిథులు హాజరవుతుండగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2,000 మంది ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు.

రాష్ట్ర పెట్టుబడి అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన విజన్–2047 పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలను సీఎం వివరిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితర ప్రముఖులు వివిధ రంగాలకు సంబంధించిన సెషన్లలో సంభాషణలు, ప్రసంగాలు ఇవ్వనున్నారు. 27 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు సమిట్‌లో భాగంగా ఏరోస్పేస్, గ్రీన్ మొబిలిటీ, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, మూసీ నది పునరుజ్జీవనం వంటి 27 ప్రధాన అంశాలపై సమావేశాలు, నిపుణుల చర్చలు జరుగనున్నాయి. రేపు సమిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్–2047’ ను విడుదల చేస్తారు. తద్వారా 2047 నాటికి తెలంగాణ ఎలా అభివృద్ధి చెందాలన్న దానిపై ప్రభుత్వం రూపొందించిన వ్యూహాత్మక దిశను ఈ దార్శనిక పత్రం వివరించనుంది.

అతిథుల కోసం సాంస్కృతిక–ఆతిథ్య సత్కారం దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతిష్ఠాత్మక అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆతిథ్య ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ ప్రసిద్ధి చెందిన బిర్యానీతో పాటు సంప్రదాయ తెలంగాణ వంటకాలు వడ్డించనున్నారు. అలాగే ఇప్పపువ్వు లడ్డు, సకినాలు వంటి ప్రాంతీయ స్వాదిష్ట వంటకాలతో ప్రత్యేక హ్యాంపర్‌ను అందించనున్నారు. సాయంత్రం సందర్భంగా ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరి, కొమ్ము కోయ, బంజారా, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణీ, బోనాల వంటి సాంప్రదాయ నృత్య–సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గిన్నిస్ రికార్డును లక్ష్యంగా పెట్టుకుని ఒక భారీ డ్రోన్ షో కూడా ఏర్పాటు చేశారు. అదనంగా, అతిథులకు పోచంపల్లి ఇక్కత్ శాలువాలు, చేర్యాల చిత్రకళ వంటి జ్ఞాపికలను అందించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’ విడుదలతో ఈ రెండు రోజుల అంతర్జాతీయ సమిట్ ముగియనుంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -