end
=
Sunday, January 25, 2026
వార్తలుఅంతర్జాతీయంఅమెరికాలో జన్మతః పౌరసత్వం పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Advertisment -

అమెరికాలో జన్మతః పౌరసత్వం పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

America : అమెరికాలో జన్మతః పౌరసత్వం(Citizenship by birth) (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) అనేది బానిసల పిల్లల కోసం ఉద్దేశించిందే తప్ప, ఇతర దేశాల నుంచి వచ్చే ధనిక వలసదారులు తమ కుటుంబం మొత్తానికి పౌరసత్వం కల్పించుకోవడానికి కాదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణకు అంగీకరించిన కొద్ది రోజులకే ట్రంప్ ఇలా స్పందించటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దృష్టిని ఆకర్షించింది. అమెరికన్ మీడియా సంస్థ పోలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ఘనంగా సమర్థించారు. అంతర్యుద్ధ కాలంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించేందుకు 14వ సవరణను ఉపయోగించినప్పటికీ, నేటి పరిస్థితిలో కొందరు విదేశీ ధనిక కుటుంబాలు కేవలం అమెరికా భూభాగంలో ప్రసవించడం ద్వారా తమ సంపూర్ణ కుటుంబానికి పౌరసత్వం పొందే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.

ఈ ధోరణి అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని, సుప్రీంకోర్టు ఈ వివాదంలో తప్పు నిర్ణయం తీసుకుంటే దేశానికి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ హెచ్చరించారు. 2025 జనవరిలో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉంటున్నవారు అక్కడే ప్రసవించిన పక్షంలో వారి పిల్లలకు పౌరసత్వం అందకూడదని నిబంధించారు. అయితే, ఈ ఆదేశాన్ని అనేక ఫెడరల్ కోర్టులు స్థగితపరిచాయి. దీంతో ఈ వివాదం నేరుగా సుప్రీంకోర్టు ద్వారాలను తట్టింది. డిసెంబర్ 5న సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించగా, వచ్చే వేసవికల్లా తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశ భూభాగంలో పుట్టిన వారంతా పౌరులుగా పరిగణించబడతారు. అయితే, ‘అమెరికా అధికార పరిధికి లోబడి ఉండాలి’ అనే నిబంధనలో ఎవరు వస్తారు, ఎవరు రారు అనే విషయంపై ప్రస్తుతం తీవ్రమైన వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసదారులు, విదేశీ పర్యాటకులు, తాత్కాలిక వీసాదారులు ఈ పరిధిలోకి వస్తారా లేదా అన్న అంశమే ఈ కేసుకు ప్రధాన కేంద్రబిందువుగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు 2024–25 రాజకీయ వాతావరణాన్ని మరింత వేడిగ మార్చాయి. రాబోయే సుప్రీంకోర్టు తీర్పు అమెరికాలో పౌరసత్వ విధానాల భవిష్యత్తును నిర్ణయించబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -