- ఇప్పటికే కోటిమందికి పైగా చేరుకున్న భక్తులు
- నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక
- స్వాగతం పలుకనున్న మంత్రులు సీతక్క, సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్ (smmakka,sarrkka) : తెలంగాణ కుంబమేళాగా పేరొందిన మేడారం(medaram) జనగుడారంలా మారింది. బుధవారం రాత్రి (sarallamma) సారలమ్మ,పగిడిద్దరాజు,గోవిందరాజులను ఆదివాసి పూజారులు వారి సంప్రదాయంలో పూజలు నిర్వహించి గద్దెపై ప్రతిష్టించారు. దీంతో భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు.
అయితే గురువారం సాయంత్రం సమక్క తల్లి (sammakka )గద్దెపైకి రానున్నది. అమ్మవారి రాక సందర్భంగా జిల్లా ఎస్పీ ఏకే 47తో గౌరవ సూచికంగా గాల్లోకి మూడురౌండ్లు కాల్పులు జరుపనున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు సీతక్క(seethakka), (konda surekha),సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (pognguleti srinivasreddy)అమ్మవారికి స్వాగతం పలకనున్నారు.
ఇప్పటికే మేడారంలో కోటికి పైగా భక్తులు చేరుకొని అమ్మవర్లను దర్శించుకుంటున్నారు. నేడు అమ్మవార్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kishanreddy) దర్శించుకోనున్నారు. జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా స్వయంగా మంత్రి పొంగులేటి బైక్‌పై తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
