end
=
Friday, June 20, 2025
వార్తలుజాతీయంప్రభాస్‌తో నటన అపురూపం
- Advertisment -

ప్రభాస్‌తో నటన అపురూపం

- Advertisment -
- Advertisment -

మాళవిక మోహనన్.. (Actress Malavika Mohanan) సినిమా రంగంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ మోహనన్ (Cinematographer Mohanan)​ తనయగా కాకుండా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు మంచి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హిందీ చిత్రం ‘యుద్ర’, తమిళ చిత్రం ‘తంగాలన్​’లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘యుద్ర’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టినప్పటికీ, ‘తంగాలన్​’ చిత్రంలో ఆమె పోషించిన దేవత పాత్రకు విమర్శకుల ప్రశంసలు (Big applause) అందాయి.

ప్రేక్షకులు కూడా ఆమె పాత్రను వేనోళ్ల కొనియాడారు. తెలుగులో ఆమె నేరుగా నటిస్తున్న మొదటి చిత్రం ‘రాజాసాబ్​’ (Raja saheb Movie). పాన్​ ఇండియన్​ స్టార్​ ప్రభాస్ (Pan Indian Star Prabhas)​ సరసన మాళివిక తళుక్కమననున్నారు. టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో అందరి కళ్లూ ఇప్పుడు ఆమెపైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్​లో మాళవికనే ప్రత్యేక ఆకర్షణ. టీజర్​ ఇప్పుడు యూట్యూబ్​లో ట్రిండెంగ్​లో ఉంది.

ప్రేక్షకాదరణపై ఆమె తాజాగా సోషల్​ మీడియాలో స్పందించారు. “రాజాసాబ్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఫీలవుతున్నా. ప్రభాస్‌ను ఫస్ట్‌టైమ్ సెట్స్‌లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్‌మెంట్ అనిపించింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు. ఆయనతో నటించడం జీవితంలో అపురూపమైన క్షణాలు.

పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -