end
=
Sunday, January 25, 2026
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంతిరుమల శ్రీవారి ఆలయంలో బయటపడ్డ మరో స్కాం
- Advertisment -

తిరుమల శ్రీవారి ఆలయంలో బయటపడ్డ మరో స్కాం

- Advertisment -
- Advertisment -

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి(Lord Venkateswara) సన్నిధి ఇటీవలి కాలంలో వరుస అవకతవకలతో కకావికలమవుతోంది. పరకామణి తాళాల చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలు భక్తులను ఇంకా మరవకముందే, ఇప్పుడు తిరుమలలో మరో భారీ కుంభకోణం (Huge scandal) వెలుగులోకి వచ్చింది. దాతలు, వీఐపీలకు అందించే పట్టు శాలువాల(Silk shawls) కొనుగోళ్లలో గత పదేళ్లుగా భారీ మోసం జరుగుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీలలో బయటపడింది. శ్రీవారిని దర్శించుకునే వీఐపీలు, దాతలను రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి పట్టు శాలువాతో సన్మానించడం తిరుమలలో సాంప్రదాయం. ఈ కార్యక్రమం కోసం టీటీడీ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున మల్బరీ పట్టు శాలువాలను కొనుగోలు చేస్తుంది.

అయితే, నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ 2015లో టెండర్ పొందినప్పటి నుంచి ఈ శాలువాల సరఫరా బాధ్యత చేపట్టింది. ఇటీవల టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ శాలువాల నాణ్యతను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టెండర్ షరతుల ప్రకారం, స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, నిర్ణీత బరువు, పరిమాణంతో పాటు ‘ఓం నమో వేంకటేశాయ’ అక్షరాలు, శంకు–చక్ర నామాలతో శాలువాలు తయారు చేయాల్సి ఉంది. కానీ సరఫరా అయిన శాలువాలు పూర్తిగా పాలిస్టర్‌తో ఉన్నట్లు తొలి పరీక్షల నుంచే అనుమానం వచ్చింది. అనుమానాస్పద నమూనాలను బెంగళూరు మరియు ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్‌లకు పంపిన తర్వాత, అవి నిజమైన పట్టు శాలువాలు కావని, 100 శాతం పాలిస్టర్‌తో తయారై ఉన్నాయని అధికారిక నివేదికలు వెల్లడించాయి. నిజానికి ఒక్కో పాలిస్టర్ శాలువా విలువ రూ.350–400 మాత్రమే.

అయితే ఈ సంస్థ వాటిని మల్బరీ పట్టు పేరుతో ఒక్కొక్కటిని రూ.1,389కు టీటీడీకి విక్రయిస్తూ భారీగా లాభాలు గడించినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. ఇక,పై ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. బాధ్యులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీని కోరింది. అంతేకాకుండా, గతంలో కాంచీపురంలోని ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో నమూనా మార్పిడి జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి మోసాలు చోటుచేసుకోవడం భక్తులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -