end
=
Thursday, August 7, 2025
వార్తలురాష్ట్రీయంనేర పరిశోధనలో కృత్రిమ మేధ
- Advertisment -

నేర పరిశోధనలో కృత్రిమ మేధ

- Advertisment -
- Advertisment -

మేడ్చల్​ ట్రైనింగ్​ సెంటర్​లో రిఫ్రెషర్ కోర్సు
శిక్షణ ఇస్తున్న సాంకేతికత, ఏఐ నిపుణుడు నికిల్​

నేటి డిజిటల్ ప్రపంచం (Digital world)లో సైబర్​ నేరాలు (Cyber Crime) రోజురోజకూ పెరిగిపోతున్నాయి. పోలీస్ శాఖ (Police Department) సైతం టెక్నాలజీని అత్యాధునిక సాంకేతికత (Modern Technology)ను వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్​ శాఖ తాజాగా మేడ్చల్​లోని పోలీస్​ ట్రైనింగ్ సెంటర్‌(Police Training Center)లో శిక్షణ పొందుతున్న భావి పోలీస్​ సిబ్బంది,

అధికారులకు కృత్రిమ మేధ (Artificial Intellegence)పై రిఫ్రెషర్ కోర్సు నిర్వహిస్తున్నది. గెస్ట్ ట్రైనర్ నికిల్​ గుండా (Trainer Nikil Gunda)ఆధునిక టెక్నాలజీ వినియోగంపై వారికి శిక్షణ ఇస్తున్నారు. నేర పరిశోధనలో ప్రాక్టికల్ గా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలనేది వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ టూల్స్‌ను ఉపయోగించి విచారణ వేగవంతం చేసే విధానాలను బోధిస్తున్నారు. డీప్‌ఫేక్, ఫిషింగ్ స్కామ్స్, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్,

సోషల్ మీడియా అనాలిసిస్, వాయిస్ రికగ్నిషన్ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రిన్సిపాల్ పీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో కోర్సు విజయవంతంగా కొనసాగుతున్నది. డీఎస్పీ లక్ష్మణ్​, ఇన్స్పెక్టర్లు కిరణ్, రవి, చంద్రశేఖర్ కోర్సును పర్యవేక్షిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -